Saturday , 20 April 2024

Vijayawada: విజయవాడలో చికెన్, మటన్ మాఫియా రెచ్చిపోతోంది.. ఏం చేస్తుందంటే..

విజయవాడలో చికెన్, మటన్ మాఫియా రెచ్చిపోతోంది. నిల్వ చేసిన, కుళ్ళిన మాంసం అమ్మకం జోరుగా సాగుతోంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే మాంసం విక్రయాలపై వీఎంసీ వెటర్నరీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీఎంసీ వెటర్నరీ డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే పలు మాంసాహార దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు.

పలు దుకాణాల్లో కుళ్లిన, నిల్వ ఉన్న మాంసాన్ని వీఎంసీ అధికారులు గుర్తించారు. దుర్గాపురం, మాచవరం, వన్‌టౌన్ మార్కెట్‌లలో చనిపోయిన గొర్రెల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన మాంసాన్ని ధ్వంసం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి కూలర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 బెజవాడలో కుళ్లిన మాంసం లభ్యమైంది

నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని తినడం ఆరోగ్యానికి హానికరమని డాక్టర్ కృష్ణదాస్ అన్నారు. ఐస్ పై నిల్వ ఉంచిన మాంసం, కుళ్లిన మాంసం తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. కుళ్ళిన మాంసంలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఉంటాయి. కుళ్లిన మాంసం తినడం వల్ల శరీరంలోని రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందని తెలిపారు. ఆ మాంసం తినడం వల్ల శరీర అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది.

రక్తానికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల అవయవాలు దెబ్బతిన్నాయన్నారు. కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుందని చెప్పారు. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ వల్ల జ్వరం, తలనొప్పి వస్తుందని చెప్పారు. తాజా మాంసం తినకుంటే రోగాలు వస్తాయని అంటారు. తాజా మాంసం కొనుగోలు చేయాలని వైద్యులు చెబుతున్నారు.

Check Also

ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …

GST December

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. …

world cup 2023 SA vs Srilanka

world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..

ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *