Sunday , 14 April 2024
AP Elections 2024

AP Elections: వాలంటీర్లే రాజకీయ వారధులు!

AP Elections: రాజకీయాల్లో కొత్తపోకడలు వచ్చాయి. రాజకీయాల్లో వ్యాపారం పోయింది. రాజకీయమే వ్యాపారం అయింది. ఏపీ ఎన్నికల వేళ సరికొత్త విన్యాసాలు మొదలయ్యాయి. నిజానికి ఇవి ఇప్పుడు మొదలు కాలేదు. వీటికి బీజం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పడింది. ఏ లక్ష్యాన్ని ఆశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చారో అది పూర్తీ స్థాయిలో విజయవంతం అయింది. ఒక గొలుసుకట్టు వ్యాపారంలా.. ఇదొక గొలుసుకట్టు రాజకీయం(AP Elections). ఏభై కుటుంబాలకో వాలంటీర్. వాళ్ళ మంచీ చెడ్డా చూడడం అనే పేరుతొ పూర్తిస్థాయిలో వారి వ్యక్తిగత విషయాలనన్నిటినీ క్రోడీకరించడం వాలంటీర్ మొదటి లక్ష్యం. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. ఎందుకంటే, ఒక పథకం అందాలంటే దరఖాస్తు చేయాలి. దరఖాస్తును రాయాల్సింది.. పరిశీలించాల్సింది.. దానిని గ్రామ సచివాలయంలో ఇవ్వాల్సింది.. తరువాత ఆ వివరాలను ద్రువీకరించాల్సింది కూడా వాలంటీర్స్. మరి వీరికి పూర్తీ స్థాయిలో తమ పరిధిలోని కుటుంబాల చరిత్ర అంతా తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ కుటుంబంలో ఎంతమంది సంపాదన పరులున్నారు.. పిల్లలెంతమంది? ఏమి చదువుతున్నారు.. ఉద్యోగాలు ఏమిటి? పెళ్ళిళ్ళు ఎవరితో జరిగాయి.. ఇలా ఒక్కటేమిటి.. అన్ని వివరాలు వాలంటీర్ కి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియవు.

ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ మంచిదా? చెడ్డదా? వాలంటీర్ ఉద్యోగాలు తీసేయాలి.. ఇలాంటివి ఏమీ చర్చించడం లేదు. కేవలం ఆ వ్యవస్థతో రాజకీయ వ్యాపారం ఎలా జరుగుతుందో కాస్త చర్చిస్తున్నాం అంతే. సరే.. ఇక ఎన్నికల దగ్గరకు వచ్చేద్దాం. ఈసారి ఎన్నికలు(AP Elections) అన్ని పార్టీలకు చావో రేవో లాంటివి. అందుకే అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో తలమునకలై ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కచోట చేరి కూటమి కట్టాయి. వైసీపీ ఒక్కటీ ఒంటరిగా బరిలో ఉంది. సాధారణంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయితే వార్ వన్ సైడ్ అని అనుకోవచ్చు. కానీ ఏపీ పరిస్థితులు అందుకు భిన్నంగా హోరాహోరీగా ఉన్నాయి. ప్రతిపక్షాల కూటమి కచ్చితంగా గెలుస్తుంది అని అనుభవజ్ఞులైన రాజకీయ పరిశీలకులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. దానికి కారణం ప్రభుత్వ పథకాల పందేరం ఒకటి అయితే.. దానిని మించి ప్రభుత్వానికి – ప్రజలకు – పార్టీకి వారధులుగా నిలిచినా వాలంటీర్ సైన్యం పెద్ద కారణంగా కనిపిస్తోంది.

Also Read: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో(AP Elections) పనిచేయకూడదని ఎలక్షన్ కమిషన్ కచ్చితంగా చెప్పేసింది. అయినా, చాలా చోట్ల పథకాలను చెప్పడం పేరుతొ ప్రజలను వైసీపీకి ఓటు వేయకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి అనే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ విధానం వాలంటీర్ల ద్వారా జరుగుతున్నా సంఘటనలు వెలుగులోకి వీడియోలు.. ఫోటోల ద్వారా మీడియాలో వెల్లువెత్తాయి. దీనిపై ఈసీ సీరియస్ అయింది. అలా ప్రచారం చేసిన వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఇలా అయితే కష్టం కదా. అధికార పక్షానికి ఇది మింగుడు పడని అంశం. వాలంటీర్ల పైనే ప్రచార నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు సరికొత్త పాచిక వేశారు. వాలంటీర్లుగా పనిచేస్తున్నవారిని రాజీనామాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా వాలంటీర్ల విషయంలో ఈసీ అధికారం పోతుంది. ఇప్పుడు వీరందరినీ ఇంటింటి ప్రచారం (AP Elections)కోసం వాడుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల వాలంటీర్స్ రాజీనామాలు చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వారికి తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అందరికీ మళ్ళీ వారి ఉద్యోగాలు వారికి ఇస్తామని అధికార పార్టీ నాయకులు హామీ ఇస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు.

ఇక్కడ అధికార పార్టీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్ధులు ప్రచారం కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. రాజీనామా చేసి ఉద్యోగం వదిలేసుకున్న వాలంటీర్స్ ఇప్పుడు పార్టీ కండువా కప్పుకుని ఎవ్వరినీ లెక్కచేయకుండా ప్రచారం (AP Elections)చేసుకోవచ్చు. ఇంటింటికీ తిరిగి అధికార పార్టీ ఇచ్చిన పథకాలు అన్నిటినీ వారికి చెప్పి.. ఇంత లాభం పొందిన మీరు ఓటు వైసీపీ కి వేయకపోతే ఎలా అని నచ్చచెప్పగలుగుతారు. వారిని ఎవరూ ఏమీ చేయలేరు. పార్టీ కోసం కండువా కప్పుకుని జెండా మోస్తూ తిరిగిన కార్యకర్తల కన్నా.. ఈ రాజ్యంగ బద్ధత లేని వాలంటీర్ వ్యవస్థలో పనిచేసిన వారు వ్యవస్థ నుంచి పక్కకు జరిగి వ్యక్తిగత హోదాలో నేరుగా పార్టీ కండువా కప్పుకుంటే.. వీళ్ళ ప్రభావం వంద రెట్లు ఎక్కువ ఉంటుందనడంలో సందేహం లేదు. కార్యకర్తలకి ఎవరి ఇంటివద్దకు వెళ్ళాలన్నా లిమిటేషన్స్ ఉంటాయి. కానీ, వాలంటీర్ కు ప్రతి గుమ్మం.. ఆ గుమ్మం వెనుక ఉన్న గదులు.. ఆ గదుల్లోని మనుషుల గురించి ఐదేళ్లుగా ప్రతి చిన్నవిషయం తెలుసు. పైగా వాళ్ళు వెళితే ఆ ఇంటి మహిళలు వారిని కూచోపెట్టి మాట్లాడి పంపించేంత చనువు (AP Elections) ఉంటుంది. సో.. ఎలా చూసుకున్నా ప్రతిపక్షాలు కూటమి కట్టినట్టు కనిపిస్తున్నా.. వందమందిని జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎదుర్కుంటున్నారు అని పైకి కనిపించినా.. నిజానికి ప్రతిపక్ష కూటమి వేలాది మంది వాలంటీర్ల సైన్యాన్ని దాటుకుని ఇంటింటింటికీ చేరడం చాలా కష్టమైన పని. ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి.. అధికార పక్షానికి మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య యుద్ధంలో(AP Elections) ప్రతిపక్షాలకు వాలంటీర్ గోడ పెద్ద అడ్డుకట్ట అనడంలో సందేహం లేదు. ఎంతవరకూ దానిని బద్దలు కొట్టగలరు అనే విషయంపైన ప్రతిపక్ష కూటమికి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే, ఇది అంత తేలిక కాదనిపిస్తోంది.

అన్నట్టు రాజకీయాలు-వ్యాపారం అని మొదట్లో చెప్పుకున్నాం కదా.. ఇదిగో ఇదే రాజకీయాల్లో వ్యాపారాన్ని కలగలపడం అంటే. లాభం-నష్టం రెండే వ్యాపారాల్లో ఉంటాయి. కానీ, ఏపీ రాజకీయ వ్యాపారంలో లాభం-నష్టం తో పటు మరోటి ఉంది అది భయం.. వాలంటీర్లకు వైసీపీ రాకపోతే తమ పరిస్థితి ఏమిటి అనే భయం.. ఓటర్లకు పథకాలు ఆగిపోతాయి అనే భయం. ఈ రెండు భయాల పెట్టుబడే ప్రస్తుతం అధికారపార్టీకి వజ్రాయుధం. .కాదనగలరా?

Check Also

GST December

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. …

world cup 2023 SA vs Srilanka

world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..

ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ …

world cup 2023

World Cup 2023: ఆఫ్ఘన్ పై బంగ్లా విజయం

World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *