Wednesday , 17 July 2024
The Exorcist The Terror Movie 50 Years
The Exorcist The Terror Movie 50 Years

The Exorcist Movie: భయానికి భయం తెప్పించిన సినిమా.. ఏభై ఏళ్లయినా అదే భయానకం..

భయం అంటే మీకు తెలుసా? (The Exorcist Movie)ఇలా ఎవరైనా అడిగితె ఏం నీకు తెలీదా? అని ఠపీ మని మీరు అడుగుతారు కదా. దానికి అవతలి వారు భయం అనే పదమే నాకు తెలీదు అని బీరాలు పోయారనుకోండి వెంటనే ఈ సినిమా చూపించండి. అప్పుడు భయం అంటే ఎలా ఉంటుందో వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. సినిమా చూసి భయపడతారా? అని అనకండి.. భయపడటం మాత్రమె కాదు సినిమా చూసి బయటకు వచ్చి చచ్చిపోయిన వారున్నారు. ఆ సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన వారున్నారు.. సినిమాలో ఒక్క సీన్ చూసి గుండె ఆగిపోయిన వారూ ఉన్నారు. అదే సినిమా చూస్తూ భయంతో పిల్లల్ని కనేసిన గర్భిణీలు కూడా ఉన్నారు. ఇదంతా వింటుంటే విచిత్రంగా.. ఎదో ఎక్కువ చేసేస్తున్నారు అనిపించడం ఇప్పుడు మీకు సహజం. అలా అనుకోవడం మీ తప్పుకాదు. కానీ ఇవన్నీ పచ్చి నిజాలు. ఒక్క సినిమా దాదాపుగా 20 కి పైగా ప్రాణాలు తీసేసింది. ఒకే ఒక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భయానక సినిమాలకు బాప్ లా నిలిచింది. ఇప్పటికీ మనం మన సినిమాల్లో చూసే చాలా భయానక సీన్లు ఆ సినిమా సీన్లకు అనుకరణ.. అనుసరణ లానే ఉంటాయి. ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పలేదు కదూ.. ది ఎగ్జార్సిస్ట్ (The Exorcist Movie) – అంటే భూత వైద్యుడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అని అనిపిస్తోందా.. దానికీ ఒక కారణం ఉంది. ఈ సినిమా విడుదలై ఈ ఏడాదికి 50 ఏళ్ళు. అప్పుడెప్పుడో 1973 డిసెంబర్ 26న ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక తరువాత సంవత్సర కాలంపాటు ఆ సినిమా సృష్టించిన భయం ప్రేక్షకుల్లో పోలేదు.. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా ఆ సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే ఉంది. ఆ సినిమాకి సంబంధించిన విషయాలను వింటే మీకు అర్థం అవుతుంది అప్పటికీ ఇప్పటికీ ధీ ఎగ్జార్సిస్ట్ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో..

ఇప్పటికి మీరు చాలా హారర్ సినిమాలు చూసి ఉంటారు. ఇందులో హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చాలా ఉండి ఉంటాయి. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోతున్న సినిమా (The Exorcist Movie) వెరీ స్పెషల్. మీరు ఈ సినిమా చూసి ఉండవచ్చు కానీ ఆ సినిమా తెర వెనుక కథ ఏంటి. ఇది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హారర్ చిత్రాల గురించి చాలాసార్లు పుకార్లు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ లో నటులకు వింత అనుభూతులు కలిగాయి. భయానక పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి స్టోరీలు చాలా సినిమాల విషయంలో ఇప్పుడు కూడా వింటూ ఉంటాం. అయితే.. హాలీవుడ్ హారర్ సినిమా ‘ది ఎక్సార్సిస్ట్’ సినిమా విషయంలో అన్నిటినీ ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. ఈసినిమా (The Exorcist Movie)షూటింగ్ సమయంలో అలానే, విడుదలైన తర్వాత జనాల ప్రాణాలు ఎగిరిపోయాయి.

ప్రేక్షకులు పరుగో.. పరుగు..

థియేటర్లలోనే చాలా మందికి గుండెపోటు వచ్చింది. చాలా మంది మహిళలు అబార్షన్లు చేయించుకున్నారు. అమెరికాలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల బయట అంబులెన్స్‌లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సినిమా రివ్యూ చేయడానికి వెళ్లిన సినీ విమర్శకులు కూడా సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాలకే థియేటర్ నుంచి పరుగులు తీశారు. సినిమా చూసిన వారి పరిస్థితి ఇలా ఉంటె.. సినిమా షూటింగ్ సమయంలో ఆ యూనిట్ మొత్తం ఎలాంటి భయానక పరిస్థితులు ఎదుర్కుందో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

ఈ చిత్రం దాని నిర్మాణం సమయంలో శాపగ్రస్తమైన అలాగే దురదృష్టకరమైన సినిమాగా నిలిచింది. ఈ సినిమా (The Exorcist Movie) తీస్తున్న సమయంలో దానికి సంబంధించిన 20 మంది చనిపోయారు. ఈ సినిమా షూటింగ్ 1973లో మొదలైంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ పక్షి ఎలక్ట్రిక్ సర్క్యూట్ బాక్స్‌లోకి ప్రవేశించడంతో సెట్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి రీగన్‌ కోసం ఈ సెట్‌ను నిర్మించారు. మంటలు చెలరేగడంతో సెట్ మొత్తం ధ్వంసమైంది, కానీ దెయ్యం సన్నివేశాలు చిత్రీకరిస్తున్న గదికి ఒక్క నిప్పు కూడా చేరలేదు. సెట్ మొత్తం దగ్ధమైనప్పటికీ ఆ గది అద్భుతంగా బయటపడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

చర్చి ఫాదర్ కూడా..

సెట్స్‌లో ఇది మొదటి సంఘటన కాదు. దీంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని యూనిట్ సభ్యులు చాలా భయపడ్డారు. 6 వారాల పాటు (The Exorcist Movie) షూటింగ్ ఆగిపోయింది. సినిమా తారాగణానికీ భయం పట్టుకుంది, దర్శకుడు ఫ్రైడ్‌కిన్ ఫాదర్ థామస్ బర్మింగ్‌హామ్‌ను సెట్‌ను పవిత్రం చేయడానికి పిలిచాడు. సెట్‌ను శుద్ధి చేస్తే సెట్‌లో ఉన్నవారు మరింత భయపడతారని ఫాదర్ థామస్ దర్శకుడికి చెప్పారు. ఫాదర్ సెట్ ను శుద్ధి చేయకుండా తిరిగి వెళ్ళిపోయారు.

అదొక్కటే కాదు.. ఇందులో నటించిన నటులు జాక్ మెక్‌గోవన్ మరియు వాసిలికి మలియారోస్, ఈ చిత్రంలో చనిపోయిన పాత్రలు, సినిమా షూటింగ్ పూర్తీ అయిన కొద్ది కాలానికే అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. మిగిలిన స్టార్ కాస్ట్‌ల విషయంలో కూడా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. సినిమా చూసి చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని, ఆ తర్వాత చర్చి నుంచి ప్రీస్ట్ లను పిలిపించి చికిత్స అందించారని అప్పట్లో కొందరు పేర్కొన్నారు.

వాంతులు.. మత్తు మందులూ..

ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎంత డిస్టర్బ్ అయ్యారంటే.. సినిమాని (The Exorcist Movie) మధ్యలో వదిలేసి మత్తులో కూరుకుపోయేవారు. థియేటర్ బయట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా.. మద్యం మత్తులో ఉన్న వారిని అరెస్ట్ చేయలేదు. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు చాలామంది వాంతులు చేసుకోవడం ఆపుకోలేకపోయారు. సినీఫాంటాస్టిక్ సమీక్షకుడు, ది ఎక్సార్సిస్ట్‌ను సమీక్షిస్తూ, ఈ చిత్రం వచ్చినప్పుడు, థియేటర్లలోని బాత్‌రూమ్‌లు వాంతులతో నిండిపోయాయని రాశారు. బాత్‌రూమ్‌లో దుర్వాసన రావడంతో చాలామంది అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాంతి వాసనను కప్పిపుచ్చడానికి థియేటర్ యజమానులు ఒక రకమైన ఉప్పును ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు.

భయానక దృశ్యాన్ని చూసి చాలా మందికి గుండెపోటు వచ్చింది, సినిమా చూసేందుకు వెళ్లిన గర్భిణులకు సినిమా హాలులోనే కాన్పులు అయిపోయాయి. వరుస ప్రమాదాలు, గుండెపోటులు, మూర్ఛ, గర్భస్రావాల తర్వాత, సెయింట్ జాన్స్ అంబులెన్స్ సిబ్బంది UKలోని అన్ని సినిమాహాళ్ల వెలుపల ఉండేవారు. యూనివర్శిటీ ఆఫ్ టొరంటో థియేటర్‌లో చాలా ప్రమాదాలు జరిగాయి, ఒక్క రాత్రిలో నాలుగు అంబులెన్స్‌లను పిలవవలసి వచ్చింది. ఇక ఈ సినిమా (The Exorcist Movie) చూసేందుకు వెళ్లిన ఓ మహిళ సినిమాలోని భయానక సన్నివేశాలను చూసి భయాందోళనకు గురై బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. పతనంలో మహిళ తన దవడ విరిగినప్పుడు, ఆమె చిత్ర పంపిణీదారు వార్నర్ బ్రదర్స్‌పై దావా వేసింది.

సినిమా తీయడం వెనుక కథ ఇదీ..

అది దాదాపు 1969. కామిక్ నవలా రచయి, హాలీవుడ్ స్క్రీన్ రైటర్ విలియం ఫ్రైడ్కిన్ మొదట భయానక నవల ది ఎక్సార్సిస్ట్ రాశారు. ఇది ప్రచురణ అయ్యాకా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయం దీనిని సినిమా తీయాలని అతను నిర్ణయించుకున్నాడు. వార్నర్ బ్రదర్స్ ఈ సినిమా (The Exorcist Movie) హక్కులను కొనుగోలు చేసారు. అయితే సినిమా తీయడానికి సంప్రదించిన ప్రతి దర్శకుడు తిరస్కరించారు. హార్కర్ అనే నవల రాసిన విలియం దానికి తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాలో పెద్ద డైరెక్టర్ ఎవరూ లేకపోవడంతో పెద్ద నటీనటులు కూడా సినిమాపై ఆసక్తి చూపలేదు. ఫలితంగా చిన్న నటీనటులు సినిమాలో నటించారు. 1,000 మంది అమ్మాయిలను ఆడిషన్ చేసిన తర్వాత విలియం ఈ చిత్రంలో చైల్డ్ లీడ్ పాత్ర కోసం లిండా బ్లెయిర్‌ను తీసుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించిన విశేషాలు చాలా ఉన్నాయి. ఇన్ని సంచలనాలను సృష్టించిన ఈ సినిమా (The Exorcist Movie) ఇప్పటికీ అదే క్రేజ్ తో ఉంది. ఈ సినిమా ఇప్పుడు కూడా హయ్యెస్ట్ రేటింగ్స్ లో ఉన్న సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇంతా తెలిసాకా వెంటనే గూగుల్ సెర్చ్ చేసి సినిమా ఎక్కడన్నా ఆన్ లైన్ లో ఉంటె ఫ్రీగా చూసేద్దాం అనుకుంటున్నారా? అబ్బా.. అది జరిగే పని కాదు. ఎందుకో తెలుసా? ఈ సినిమా ఇప్పటికీ.. యూట్యూబ్ నుంచి అమెజాన్ ప్రైం వంటి ఒటీటీ ల వరకూ అన్ని చోట్లా అందుబాటులో ఉన్నా.. సినిమా చూడలంటే ప్రత్యేకంగా డబ్బులు కట్టి చూడాల్సిందే.

డబ్బులు కట్టి సినిమా చూడాలని మీరు రెడీ అయిపోతే.. మీరు కచ్చితంగా పది మంది మధ్యలో కూచుని చూడండి.. ఒంటరిగా మాత్రం చూడకండి. ఈ సినిమాలో (The Exorcist Movie) ఎన్నో సీన్స్ ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో చూసి ఉండవచ్చు.. అయినా కూడా డి ఎగ్జార్సిస్ట్ సినిమా ఇప్పుడు చూసినా అదే భయం.. అదే టెన్షన్ ఉంటుంది. హార్ట్ వీక్ అయితే ఈ సినిమా చూసే ప్రయత్నం చేయకండి.

Check Also

Union Budget 2024

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈనెల 24 న.. షెడ్యూల్ ఇదే!

Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు.

India vs Zimbabwe T20

India vs Zimbabwe T20: టీమిండియా-జింబాబ్వే టీ20 సిరీస్ ఈరోజే ప్రారంభం

భారత్-జింబాబ్వే (భారత్ వర్సెస్ జింబాబ్వే) మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

Euro Cup 2024

Euro Cup 2024: యూరో కప్ లో సెమీస్ కు ఫ్రాన్స్.. రోనాల్డో కల తీరలేదు..

జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ (యూరో కప్ 2024) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించింది . ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు చేరుకోగా, క్రిస్టియానో ​​రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హాంబర్గ్‌లోని వోక్స్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *