Sunday , 14 April 2024
FIFA World Cup 2022 Portugal team out from race Morocco in Semis
FIFA World Cup 2022 Portugal team out from race Morocco in Semis

FIFA World Cup 2022: మరో పెద్ద సంచలనం.. మొరాకో డిఫెన్స్ దెబ్బకు రోనాల్డో టీం అవుట్!

FIFA ప్రపంచ కప్ 2022(FIFA World Cup 2022)లో వరుసగా మూడో క్వార్టర్-ఫైనల్ పెద్ద పరాజయాన్ని చవిచూసింది. మొరాకో జట్టు..  క్రిస్టియానో ​​రొనాల్డో జట్టు పోర్చుగల్‌ను 1-0 తేడాతో  ఓడించింది.  పోర్చుగల్ ప్రపంచ కప్  నుంచి  నిష్క్రమించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఏడుస్తూ మైదానం వీడాడు.

ఈ విజయంతో ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టుగా మొరాకో నిలిచింది. 42వ నిమిషంలో మొరాకోకు చెందిన యూసఫ్ అన్-నెస్రీ ఏకైక గోల్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో మరో గోల్‌ నమోదు కాలేదు.

పోర్చుగల్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది
మొత్తం మ్యాచ్‌లో పోర్చుగల్(FIFA World Cup 2022) ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఆ జట్టు 16వ రౌండ్‌లో స్విట్జర్లాండ్‌ను 6–1తో భారీ తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకోను పోర్చుగల్ సులభంగా ఓడించే అవకాశం కనిపించింది. కానీ, తొలి అర్ధభాగంలో ఆధిక్యం సాధించిన మొరాకో డిఫెన్స్‌ను పటిష్టం చేసుకుంది. దీంతో మొత్తం మ్యాచ్‌లో పోర్చుగల్ గోల్ చేయలేకపోయింది.

మ్యాచ్‌లో పోర్చుగల్ ఆధిపత్యం చెలాయించింది
పోర్చుగల్ జట్టు(FIFA World Cup 2022) మ్యాచ్‌లో 74% సమయం బంతిని తన దగ్గరే ఉంచుకుంది. అయినా కూడా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.  పోర్చుగల్ టీం లక్ష్యం వైపు 12 సార్లు వెళ్ళింది.  అయితే,  కేవలం 3 సార్లు  మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంది.  కానీ, దీనిని మొరాకో గోల్ కీపర్ బోనో సమర్ధంగా అడ్డుకున్నాడు.  పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో ​​రొనాల్డో ప్రారంభ XIలో భాగం కాలేదు. 53వ నిమిషంలో రూబెన్ నెవెస్‌కు ప్రత్యామ్నాయంగా మైదానంలోకి వచ్చాడు.

తొలి అర్ధభాగంలోనే మొరాకో గోల్‌ రావడంతో
తొలి అర్ధభాగంలో మొరాకో ఏకైక గోల్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. హాఫ్‌టైమ్‌కు ముందు 42వ నిమిషంలో మొరాకో ఆటగాడు అన్-నెస్రీ గోల్ చేశాడు. హెడర్‌కు దిశానిర్దేశం చేస్తూ క్రాస్ నుంచి వచ్చిన బంతిని పోర్చుగల్ నెట్‌లోకి మళ్లించాడు. నెస్రీ ప్రపంచకప్(FIFA World Cup 2022) చరిత్రలో మొరాకో జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ స్కోరర్ అయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మూడు గోల్స్ చేశాడు.

తొలి అర్ధభాగంలో ఒత్తిడి సృష్టించిన మొరాకో
తొలి అర్ధభాగంలో మొరాకో జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సమయంలో,  మొరాకో  గోల్ వైపు 7 షాట్లు కొట్టింది . అదే సమయంలో పోర్చుగల్ కేవలం 5 షాట్లు మాత్రమే కొట్టగలిగింది. తొలి అర్ధభాగంలో మొరాకో కూడా గోల్ చేసింది. కానీ, పోర్చుగల్ అలా చేయలేకపోయింది. ఎక్కువ బాల్ పొసెషన్ ఉన్నప్పటికీ, పోర్చుగల్ ప్రథమార్థంలో(FIFA World Cup 2022) అవకాశాలు సృష్టించుకోలేకపోయింది. పోర్చుగల్ మొదటి అర్ధ భాగంలో 66% సమయం బాల్ పోర్చుగల్ చేతిలోనే ఉంది.

రెండు జట్ల ప్రారంభ XI (FIFA World Cup 2022)
మొరాకో: (4-3-3) యాసిన్ బోనో, అష్రఫ్ హకీమి, యామిక్, రొమైన్ సైస్, యాహ్యా అటియాట్-అల్లా, సలీం ఆమ్లా, సోఫియాన్ అమ్రాబత్, ఔనాహి, హకిమి జీచ్, అన్-నెస్రీ మరియు బౌఫాల్.
పోర్చుగల్: (4-4-3) డియెగో కోస్టా, డియోగో డలోట్, పెపే, రూబెన్ డయాస్, రాఫెల్ గెరెరో, రూబెన్ నెవెస్, ఒటావియో, బెర్నార్డో సిల్వా, బ్రూనో ఫెర్నాండెజ్, జోవో ఫెలిక్స్ మరియు గొన్సాలో రామోస్.

 

 

Check Also

ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …

GST December

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. …

world cup 2023 SA vs Srilanka

world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..

ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *