Sunday , 16 June 2024
Samantha Yashoda Movie Trailer Review
Samantha Yashoda Movie Trailer Review

Samantha Yashoda Movie:సరోగాసీ మాఫియాపై క్రైం థ్రిల్లర్ యశోద మూవీ.. సమంత ఆదరగొట్టిందిగా

కాకతాళీయమో.. మరోటో కానీ ఈ మధ్య సరోగాసీ నేపధ్యంలో సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇటీవలే నయనతార సరోగాసీ ద్వారా పిల్లలను కన్న విషయంపై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయంగానూ దేశవ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడో సిద్ధం అయిన సినిమాలలో కూడా సరోగాసీ నేపధ్యం ఉండడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొన్నటికి మొన్న స్వాతిముత్యం, కృష్ణ వ్రింద విహారి వంటి సినిమాలు సరోగాసీ నేపధ్యంతో వచ్చాయి. ఇప్పుడు తాజాగా సమంత కూడా సరోగాసీ నేపధ్యంలో ఓ యాక్షన్ మూవీతో ముందుకు వస్తోంది. ఆ మూవీ యశోద. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11 న విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

సరోగసీ కేంద్రంగా చెలరేగిపోతున్న మాఫియా పై ఒక యువతి సాగించిన పోరాటంలా యశోద ఉండబోతోందని ట్రైలర్ చూస్తె తెలుస్తోంది. రిచ్ గా ఉన్న ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత ఆదరగోట్టేసింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ సమంత రెచ్చిపోయినట్టు ట్రైలర్ చెబుతోంది. దాదాపు రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో యశోద ట్రైలర్ పర్ఫెక్ట్ బ్లెండ్ లా ఉంది.

సమంత లేటెస్ట్ మూవీ యశోద వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. దర్శక ద్వయం హరి-హరీష్ ఒక సోషల్ బర్నింగ్ టాపిక్ ఆధారంగా యశోద తెరకెక్కించినట్టు అర్ధం అవుతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లో మణిశర్మ బీజీఎమ్ ఆకట్టుకుంది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే మురళీ శర్మ, రావు రమేష్, సంపత్ రాజు, శత్రు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతుండగా యశోద ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటె దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న.. సమంత నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం శాకుంతలం విడుదల వాయిదా పడింది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కావచ్చు. పౌరాణిక గాథగా శాకుంతలం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీటితో పాటు విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రంలో కనిపించనుంది సమంత.. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా శాకుంతలం తెరకెక్కుతుంది. బాలీవుడ్ సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్లు కూడా చేస్తున్న సమంత ప్రస్తుతం బిజీగా ఉన్నారని చెప్పొచ్చు.

Check Also

IPL 2024 Mumbai Indians vs Gujarat Titans

IPL 2024: ఐదు సార్లు ఛాంపియన్.. తొలి మ్యాచ్ లో 12 సార్లు ఓటమి! ముంబై తీరిదే!

IPL 2024: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈసారి ఆ జట్టు 2022 …

IPL 2024

IPL 2024: ఐపీఎల్ ప్రారంభ వేడుక ఎలా ఉంటుందంటే..

IPL 2024 సీజన్ 17 సమీపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందులో …

ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *