గత కొద్ది రోజులుగా నీటి ప్రవాహం క్రమంగా పెరగడంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ (Krishna River Floods) శాంతించింది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో డ్యాం గేట్లు ఎత్తి అదనపు నీటిని సముద్రంలోకి పంపుతున్నారు. గరిష్ట నీటి ప్రవాహాన్ని 2.70 లక్షల క్యూసెక్కుల నుంచి ప్రస్తుతం 96 వేల క్యూసెక్కులకు తగ్గించారు. శనివారం రాత్రి 9 గంటలకు ప్రకాశం బ్యారేజీలో ఇన్ ఫ్లో 96 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో కూడా 96 వేల క్యూసెక్కులుగా ఉంది.
డ్యాం గరిష్ట నీటిమట్టం 3.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 గేట్లలో 65 గేట్లను రెండు అడుగులు, 5 గేట్లను ఒక అడుగు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో కృష్ణమ్మ పరవళ్లను చూడటానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. నీటి ప్రవాహాన్ని(Krishna River Floods) చూసేందుకు, ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో డ్యాం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: బ్రిటిష్ అధికార పీఠం పై భారత్ సంతతికి చెందిన రిషి సునక్