Saturday , 27 July 2024
ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ప్రచారాలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. సువిధ యాప్ ద్వారా సమావేశాలు, ప్రచారాలకు అనుమతులు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించారు. చట్ట ప్రకారం అది నేరం. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. నిన్నటి వరకు 46 మందిపై చర్యలు తీసుకున్నారు. కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి.

వాలంటీర్లు ప్రచారానికి వెళితే క్రిమినల్ కేసులు
“వాలంటీర్లు, ఉద్యోగులు సొంతంగా ప్రచారానికి(AP Elections) వెళితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రధాని మోడీ భేటీకి సంబంధించి ఫిర్యాదులు అందాయి. ఇది హోంశాఖకు సంబంధించినది. రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వాలి. “పొలిటికల్ తొలగించాలని ఆదేశించాం. మూడు రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనలు.. నిబంధనల ఉల్లంఘనపై మూడు రోజుల్లో 385 కేసులు నమోదయ్యాయి. -సీఈవో ముఖేష్ కుమార్ మీనా

Also Read: మన దేశంలో పది శాతం గర్భిణీలకు గర్భస్రావం జరుగుతోంది.. కారణాలేమిటంటే..

ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పరిశీలిస్తాం.. 
ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌లో జనసేన గ్లాసు సింబల్‌పై డైలాగ్‌లు ఉన్నాయని మీడియా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకువచ్చారు.  అయితే తాను ఈ టీజర్ చూడలేదని చెప్పాడు. రాజకీయ ప్రచారమైతే ఎన్నికల సంఘం (AP Elections)అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. టీజ‌ర్ చూస్తే మ‌న‌కు చెప్ప‌లేం. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను సి-విజిల్ యాప్ ద్వారా దాఖలు చేయవచ్చని తెలిపారు. సి-విజిల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో 1.99 లక్షల రాజకీయ హోర్డింగ్‌లు, ప్రైవేట్ స్థలాల్లో 1.15 లక్షల ప్రకటనలను తొలగించారు. గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Check Also

Union Budget 2024

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈనెల 24 న.. షెడ్యూల్ ఇదే!

Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు.

India vs Zimbabwe T20

India vs Zimbabwe T20: టీమిండియా-జింబాబ్వే టీ20 సిరీస్ ఈరోజే ప్రారంభం

భారత్-జింబాబ్వే (భారత్ వర్సెస్ జింబాబ్వే) మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

Euro Cup 2024

Euro Cup 2024: యూరో కప్ లో సెమీస్ కు ఫ్రాన్స్.. రోనాల్డో కల తీరలేదు..

జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ (యూరో కప్ 2024) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించింది . ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు చేరుకోగా, క్రిస్టియానో ​​రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హాంబర్గ్‌లోని వోక్స్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *