Sunday , 16 June 2024
Pathaan Song
Pathaan Song

Pathaan Song: పఠాన్ నుంచి మరో పాట.. దీపికా అందాల ఆరబోత.. షారూక్ స్టెప్పుల మోత!

ఈ మధ్యకాలంలో విడుదల (Pathaan Song)కు ముందే అత్యంత వివాదాస్పదంగా మారిన సినిమా ఏదైనా ఉందంటే అది షారూఖ్ నటించిన పఠాన్ సినిమానే. ఒక్క పాట విడుదల చేసిన వెంటనే దుమారం రేగింది. ఈ వివాదం ఎంతగా ముదిరిందంటే.. పఠాన్ సినిమాను రిలీజ్ చేయకూడదు అనేంతగా. వివాదానికి కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. సిగ్గులేదు (బే షరం) అంటూ దుస్తులు ఉన్నాయా లేవా అన్నట్టుగా దీపికా వేసిన బికినీ దీనికి కారణం. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మేకర్స్ పఠాన్ సినిమా నుంచి మరో పాట విడుదల చేసేశారు.

తాజాగా విడుదలైన పాటలోనూ దీపికా అందాల ఆరబోత (Pathaan Song) కనిపిస్తోంది. కానీ, మొదటి పాటలో ఉన్నంత బే షరంగా కాదు. షారూక్ ఈ పాటలో వేసిన స్టెప్స్ కూడా అదిరిపోయాయి. మొదటి పాట వివాదం మాట ఎలా ఉన్నా ఈ రెండో పాట మాత్రం కాస్త చూడబుల్ గా ఉండడం విశేషం. ‘కుమ్మెసే పఠాన్‌ వచ్చేశాను’ అంటూ ఈ పాట ఆకట్టుకుంటోంది. దీపికా అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్న ఈ పాటలో షారూక్ డాన్స్ మూమెంట్స్ కూడా చూడముచ్చటగా అనిపిస్తున్నాయని అభిమానులు అంటున్నారు.

ఈ రెండో పాటతో అయినా (Pathaan Song) .. మొదటి పాట వివాదాలు సర్దు మణుగుతాయేమో చూడాలి.. మరి ఈ పాట ఎలా ఉందో మీరూ ఓ లుక్కేసెయ్యండి..

Also Read: 

Laatti Review: కథతో సంబంధం లేకుండా యాక్షన్ చాలు అనుకుంటే ‘లాఠీ’ చూసేయవచ్చు!

 

Check Also

IPL 2024 Mumbai Indians vs Gujarat Titans

IPL 2024: ఐదు సార్లు ఛాంపియన్.. తొలి మ్యాచ్ లో 12 సార్లు ఓటమి! ముంబై తీరిదే!

IPL 2024: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈసారి ఆ జట్టు 2022 …

IPL 2024

IPL 2024: ఐపీఎల్ ప్రారంభ వేడుక ఎలా ఉంటుందంటే..

IPL 2024 సీజన్ 17 సమీపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందులో …

ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *