Saturday , 20 April 2024
Aditya L1
Aditya L1

ISRO Aditya L1: సూర్యుని పలకరించడానికి ఇస్రో రెడీ.. ఆదిత్య ఎల్1 మిషన్ రెడీ టూ గో..

ఆదిత్య ఎల్1 మిషన్‌(ISRO Aditya L1)ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో బుధవారం తెలిపింది. వాహనాల అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయి. ఆదిత్య ఎల్1ని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.

ఇది దాదాపు 4 నెలల్లో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 అంటే ఎల్1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఆదిత్య (ISRO Aditya L1) అంతరిక్ష నౌక ఎల్1 పాయింట్ చుట్టూ తిరుగుతుంది. సూర్యునిపై ఉత్పన్నమయ్యే తుఫానులను అర్థం చేసుకుంటుంది. దీంతోపాటు అయస్కాంత క్షేత్రం, సోలార్ విండ్ వంటి అంశాలను దీనిద్వారా అధ్యయనం చేయనున్నారు. ఆదిత్యకు ఉపయోగం కోసం 7 పేలోడ్‌లు ఉన్నాయి.

ఆదిత్య అంతరిక్ష నౌకను ఎల్1 పాయింట్‌కి మాత్రమే ఎందుకు పంపుతారు?

ఆదిత్య(ISRO Aditya L1)ను సూర్యుడు – భూమి మధ్య హాలో కక్ష్యలో ఉంచుతారు. L1 పాయింట్ చుట్టూ ఉండే కక్ష్యను హాలో ఆర్బిట్ అంటారు. ఎల్1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉంచిన ఉపగ్రహం ఎలాంటి గ్రహణం లేకుండా సూర్యుడిని నిరంతరం చూడగలదని ఇస్రో తెలిపింది.

దీనితో, నిజ-సమయ సౌర కార్యకలాపాలు – అంతరిక్ష వాతావరణాన్ని కూడా పర్యవేక్షించవచ్చు. ఆదిత్య L1 పేలోడ్ కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు, ప్రీ-ఫ్లేర్ – ఫ్లేర్ యాక్టివిటీస్ లక్షణాలు, కణాల కదలిక – అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సమాచారాన్ని అందిస్తుంది.

L1 అంటే ఏమిటి?

లాగ్రాంజ్ పాయింట్‌కి ఇటాలియన్-ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త జోసెఫ్-లూయిస్ లాగ్రాంజ్ పేరు పెట్టారు. దీనిని సాధారణంగా L-1 అంటారు. భూమి -సూర్యుని మధ్య అటువంటి ఐదు పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ సూర్యుడు – భూమి గురుత్వాకర్షణ శక్తి సమతుల్యతను పొందుతుంది. అలాగే అపకేంద్ర శక్తి ఏర్పడుతుంది.

అటువంటి పరిస్థితిలో, ఏదైనా వస్తువును ఈ స్థలంలో ఉంచితే కనుక, అది సులభంగా రెండింటి మధ్య స్థిరంగా ఉంటుంది. దానికోసం శక్తి కూడా తక్కువ గానే అవసరం పడుతుంది. మొదటి లాగ్రాంజ్ పాయింట్ భూమి – సూర్యుని మధ్య 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. సరళంగా చెప్పాలంటే, L-1 అనేది ఏదైనా వస్తువు సూర్యుడు – భూమి నుంచి సమాన దూరంలో స్థిరంగా ఉండగల బిందువు.

Also Read:  Monsoons: దేశంలో ఒకవైపు అతి వృష్టి.. మరోవైపు కరువు ఛాయలు.. సైలెంట్ మోడ్ లో రుతుపవనాలు

Check Also

ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …

GST December

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. …

world cup 2023 SA vs Srilanka

world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..

ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *