గణనాధుని పండగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈసారి వినాయకచవితి తిథి విషయంలో గందరగోళం ఉండడంతో సోమవారం, మంగళవారం కూడా వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రమే వినాయకుడు కొలువుతీరాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలలో సోమవారం పండగ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు ప్రగతి భవన్ లో వినాయకచవితి పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయమే జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలనీ.. అందరికీ సుఖశాంతులు కాలగాలనీ ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ దంపతులు, వారి కూతురు అలేఖ్యలతో పాటు మంత్రి శీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
Tags KCR KTR Telangana Vinayaka chavithi
Check Also
Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈనెల 24 న.. షెడ్యూల్ ఇదే!
Union Budget 2024: మోడీ 3.0 ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ను జూలై 24న సమర్పించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఆర్థిక సర్వే నివేదికను జూలై 23న పార్లమెంటు కు సమర్పించనున్నారు.
India vs Zimbabwe T20: టీమిండియా-జింబాబ్వే టీ20 సిరీస్ ఈరోజే ప్రారంభం
భారత్-జింబాబ్వే (భారత్ వర్సెస్ జింబాబ్వే) మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.
Euro Cup 2024: యూరో కప్ లో సెమీస్ కు ఫ్రాన్స్.. రోనాల్డో కల తీరలేదు..
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ (యూరో కప్ 2024) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించింది . ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు చేరుకోగా, క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హాంబర్గ్‌లోని వోక్స్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు సాగింది.