ఆస్కార్ (Oscars) అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్లో ఉండే క్రేజ్ చెప్పక్కర్లేదు. సినిమా మేకర్స్ దగ్గర నుంచి నటుల వరకూ.. లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకుల వరకూ.. ఆస్కార్ (RRR in Oscars) గురించి కలలు కంటూనే ఉంటారు. విదేశీ సినిమాలు ఆస్కార్ బరిలో ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాయి. మన దేశ సినిమాలు ఎప్పుడో కానీ పెద్దగా ఆస్కార్ వాకిట్లోకి వెళ్ళవు. వెళ్ళినా అవార్డులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మనవరకూ చెప్పాలంటే ఆస్కార్ (RRR in Oscars) గుమ్మంలోకి అడుగుపెట్టడమే మన దేశ సినిమాలు అంతర్జాతీయంగా సాధించే పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.
ప్రపంచ చలనచిత్ర రంగంలో ‘ఆస్కార్’ (RRR in Oscars) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు. ఇప్పుడు అటువంటి ఆస్కార్ (Oscars) అవార్డ్స్ బరిలో సత్తా చాటేందుకు నాలుగు భారతీయ చిత్రాలు తొలి అడుగు వేశాయి. ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌లో ఉన్న సినిమాల షార్ట్‌లిస్ట్‌ను తాజాగా అకాడమీ ప్రకటించింది. దాదాపుగా పది కేటగిరీలకు చెందిన ఈ లిస్ట్ లో నాలుగు కేటగిరీల్లో మన సినిమాలకు ప్లేస్ దక్కింది. అందులో మన తెలుగు సినిమా కూడా ఉండటం విశేషం. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR in Oscars) మూవీ నుంచి నాటు నాటు పాట ఈ ఘనత సాధించింది. తెలుగు సినిమాను ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి ఇప్పుడు ఆ స్థాయిని మరింత పైకి తీసుకువెళ్ళినట్టయింది.
ఇక మన దేశం నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్ అయిన సినిమాల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీ లో లాస్ట్ ఫిల్మ్ షో (Last Film Show), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో ఆల్ దట్ బ్రీత్స్ ( All that Breaths), ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ది ఎలిఫెంట్ విష్పరర్ (The Elephant Wishperer) ఉన్నాయి.
షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన సినిమాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ ఓటింగ్‌ను ఆధారంగా జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. తరువాత మార్చి 12న విజేతలకు ఆస్కార్ అవార్డులు (RRR in Oscars) అందిస్తారు.
Also Read: