దాడులు.. ప్రతి దాడులతో ఇజ్రాయెల్ – Israel vs Hamas అట్టుడుకుతోంది. ఈరోజు అంటే అక్టోబర్ 07 ఉదయం హమాస్ 5 వేల రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో 40 మంది ఇజ్రాయెల్ పౌరలు మరణించగా.. 750 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోని 17 సైనిక గ్రూపులు.. 4 సైనిక ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 198 మంది పాలస్తీనియన్లు మరణించగా, 1600 మందికి పైగా గాయపడ్డారు. అల్జజీరా ప్రకారం, 1000 మందికి పైగా పాలస్తీనియన్లు Israel vs Hamas ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. 1948 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. గాజా స్ట్రిప్ నుండి దాడి తరువాత, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధం ప్రకటించారు. క్యాబినెట్‌తో అత్యవసర సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ – ఇదొక యుద్దం, కచ్చితంగా విజయం సాధిస్తాం. దీనికి శత్రువులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు.
మరోవైపు ఇజ్రాయెల్Israel vs Hamas లో పరిస్థితులు అధ్వాన్నంగా మారడంపై భారత్ స్పందించింది. భారత రాయబార కార్యాలయం అక్కడి భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలనీ, సురక్షితంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా భారత్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ కు వెళ్ళే అలాగే అక్కడి నుంచి వచ్చే విమానాలను నిలిపివేసింది. కష్టకాలంలో కష్టకాలంలో భారత్ ఇజ్రాయెల్ ప్రజలకు అండగా ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు.
హమాస్ ఇజ్రాయిలీలను Israel vs Hamas బందీలుగా పట్టుకుంది.హమాస్ ఇజ్రాయెల్ జనరల్ నిమ్రోద్ అలోనితో పాటు చాలా మందిని బందీలుగా పట్టుకున్నట్లు పేర్కొంది. బందీల సంఖ్య స్పష్టంగా తెలియనప్పటికీ.. పెద్ద సంఖ్యలోనే ఉండవచ్చని భావిస్తున్నారు. వారికి బదులుగా వారు ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదు చేయబడిన పాలస్తీనియన్లందరినీ విడిచిపెట్టాలని హమాస్ డిమాండ్ చేసింది. అయితే, బందీలను రక్షించేందుకు ఇజ్రాయెల్ బలగాలు ఓఫాకిమ్ ప్రాంతంలోని ఓ ఇంటిని చుట్టుముట్టాయి. ఇక్కడ అధికారులు హమాస్ యోధులతో మాట్లాడుతున్నాడు.
ఇరాన్, హమాస్ – పాశ్చాత్య దేశమైన ఇజ్రాయెల్ Israel vs Hamas మధ్య కొనసాగుతున్న వివాదంపై ప్రపంచం నలుమూలల నుంచి స్పందనలు వస్తున్నాయి . హమాస్ దాడిని పశ్చిమ దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఖండించాయి. అయితే ఇరాన్ హమాస్‌కు మద్దతు ఇచ్చింది.
ఈ వివాదంపై ఏ దేశం ఏమంటుందంటే..
ఉక్రెయిన్- ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ యుద్ధంలో మేము ఇజ్రాయెల్‌తో Israel vs Hamasఉన్నాము. తమను మరియు తమ పౌరులను రక్షించుకునే హక్కు వారికి ఉంది అని ఉక్రెయిన్ ప్రకటించింది. హమాస్ దాడితో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అన్నారు. ఇజ్రాయెల్‌కు తన స్వంత భద్రతపై పూర్తి హక్కు ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన దుఃఖ సమయంలో తాను అండగా ఉంటానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. ఇజ్రాయెల్Israel vs Hamas భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటానని అమెరికా- రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.
ఇరాన్- ఇజ్రాయెల్‌పై Israel vs Hamas పాలస్తీనా దాడికి మేము మద్దతు ఇస్తున్నామని సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారు చెప్పారు. ఇక ఖతార్- పాలస్తీనా ప్రజలపై హింసకు ఇజ్రాయెల్‌లే బాధ్యులని ఖతార్ పేర్కొంది. టర్కీ, రష్యాలు ఎలాంటి పక్షం వహించకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకూ సూచించాయి.