World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (హెచ్‌పిసిఎ) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయి బంగ్లాదేశ్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
World Cup 2023: 157 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు బ్యాడ్ స్టార్ట్ అయింది. ఓపెనర్లిద్దరూ త్వరగా ఔటయ్యారు. తంజిద్ హసన్ 5 పరుగులు, లిటన్ దాస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక్కడి నుంచి నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహదీ హసన్ మిరాజ్ 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మెహదీ హసన్ మిరాజ్ తన వన్డే కెరీర్‌లో మూడో అర్ధశతకం సాధించాడు. మిరాజ్ 73 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. అతడిని నవీన్-ఉల్-హక్ అవుట్ చేశాడు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నజ్ముల్ హుస్సేన్ శాంటో తన వన్డే కెరీర్‌లో ఆరో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. శాంటో 83 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 59 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ముగిసే వరకు నాటౌట్‌గా నిలిచాడు.
World Cup 2023: ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు శుభారంభం లభించింది. కానీ, దానిని మిగిలిన బ్యాట్స్ మెన్ నిలబెట్టడంలో విఫలం అఅయ్యారు. తొలి 20 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మిడిల్ ఓవర్లలో బంగ్లాదేశ్ స్పిన్నర్లు ఆట గతిని మార్చారు. మిరాజ్-షకీబ్ ల స్పిన్‌ను అర్థం చేసుకోవడంలో ఆఫ్ఘన్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. 21 నుంచి 38 ఓవర్ల మధ్య అఫ్గానిస్థాన్ 8 వికెట్లు కోల్పోయింది. దీంతో 156 పరుగులకు ఆలౌట్ అయింది.