సూపర్-12 గ్రూప్-2 చివరి మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు కూడా చివరి నాలుగుకు చేరాయి.
నవంబర్ 9న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. అదే సమయంలో నవంబర్ 10న అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై భారత్ ప్రదర్శన ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. అలాగే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల ట్రాక్ రికార్డును కూడా పరిశీలిస్తాం.
పాకిస్తాన్-న్యూజిలాండ్
వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా ఆరోసారి టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కి పాకిస్తాన్ చేరింది. న్యూజిలాండ్ జట్టు వరుసగా మూడోసారి, ఓవరాల్‌గా నాలుగోసారి చివరి నాలుగుకు చేరుకుంది. ఈ రెండు జట్లు టీ20 ఇంటర్నేషనల్స్‌లో 28 సార్లు తలపడ్డాయి. పాకిస్థాన్ 17 సార్లు గెలిచింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లు గెలిచింది.
టీ20 ప్రపంచకప్‌లో ఈ జట్లు ఇప్పటి వరకు 6 సార్లు తలపడ్డాయి. పాకిస్థాన్ 4, న్యూజిలాండ్ 2 గెలిచాయి. 2007 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్స్‌లో పాకిస్థాన్ కూడా న్యూజిలాండ్‌తో తలపడింది. అప్పుడు పాకిస్థాన్ గెలిచింది.
ఇంగ్లండ్ పై టీమిండియా పైచేయి
20 ప్రపంచకప్ లో భారత్, ఇంగ్లండ్ ఇప్పటి వరకు 3 సార్లు తలపడ్డాయి. 2 రెండింట్లో టీమ్ ఇండియా గెలిచింది. ఇంగ్లండ్ 1 మ్యాచ్ గెలిచింది.
2007 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య తొలి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు బాదాడు. భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- 2009 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
- 2012 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా 90 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది.
- టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏ నాకౌట్ మ్యాచ్ కూడా భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగలేదు.
- దీని ప్రకారం చూస్తె ప్రపంచ కప్ నాకౌట్ దశలో ఇంగ్లాండ్ పై భారత్ దే పైచేయి అని చెప్పవచ్చు