విమాన ప్రయాణం(Spice Jet Pilot) ఎంత స్పీడుగా ఉంటుందో అంత బోరింగ్ గానూ ఉంటుంది. ఆకాశంలోకి విమానం చేరుకున్న తరువాత ప్రయాణం అంతా గాలిలోనే.. మన చుట్టూ మేఘాలు తప్ప మరేమీ కనపడవు.. పక్కన ఉన్న ప్రయాణీకులు సరదాగా మాటలు కలిపే వారైతే ఒకే.. మొహం ముడుచుకుని కూచున్నవారైతే మనకి చికాకు తప్పదు. విమానం అనే కాదు ఏ ప్రయాణం అయినా అంతే అనుకోండి. అయితే, విమాన ప్రయాణంలో ఒక్కోసారి సరదా సంఘటనలు జరుగుతాయి. అవి కొద్దిసేపు ఆహ్లాదాన్ని పంచుతాయి.
ఇటీవల ఒక విమాన ప్రయాణంలో(Spice Jet Pilot) విమాన పైలెట్ చేసిన స్వాగత ప్రసంగం ప్రయాణీకులందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అది స్పైస్ జెట్ ఫ్లైట్. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతోంది. ఢిల్లీ లో విమానం టేకాఫ్ అవుతోంది. టేకాఫ్ అయిన సమయంలో విమాన పైలెట్ ఆ విమాన ప్రయాణం గురించి చెప్పడం జరుగుతుంది. విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది. అక్కడకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది. ఎంత ఎత్తులో విమానం ఎగురుతుంది. ప్రయాణీకులకు సహాయం చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉన్నారు.. ఇటువంటి విషయాలను ప్రయాణీకులకు చెబుతాడు పైలెట్. సాధారణంగా ఇంగ్లీష్.. హిందీ భాషల్లో ఈ ప్రకటన ఉంటుంది.
అయితే మనం చెప్పుకుంటున్న విమాన ప్రయాణంలో పైలట్(Spice Jet Pilot) చేసిన స్వాగత ప్రసంగం ఈ అంశాలను ప్రస్తావిస్తూనే కాస్తంత క్రియేటివిటీతో ఫన్ పుట్టించేలా చేశారు. ఆ పైలెట్ పేరు కెప్టెన్ మొహిత్. ఆయన విమానం బయలుదేరాకా హిందీలో చేసిన ప్రకటన ఇలా సాగింది.
ఇక్కడ నుంచి గంటన్నర పాటు మన ప్రయాణం సాగుతుంది.
కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకోండి.. పొగతాగకండి.. కాదని తాగితే శిక్ష తప్పదు..
ఇక మనం 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాం
ఇంతకంటే ఎక్కువ ఎత్తుకు వెళితే బహుశా మీరు దేవుడిని చూడవచ్చు
ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది,
బయట చాలా చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత మైనస్ నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది.
వాతావరణం బాగాలేకపోతే కాసేపు విశ్రాంతి
తీసుకోండి, అవసరమైతే ఎయిర్‌మెన్‌లను విసిగించండి..
కాకపోతే కొంచెం లిమిట్ లో చేయండి.. లేకపోతె వారు దెయ్యాలుగా మరే ప్రమాదం ఉంది.
వాయుసేనలందరికీ ఇది మనవి. నవ్వుతూ ఉండండి.
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫలహారాలు అందుబాటులో ఉన్నాయి
మీరు తోటి ప్రయాణికులతో మాట్లాడండి. ఇది మీ ప్రయాణాన్ని ఆహ్లాదంగా చేస్తుంది
చివరగా ఓ మాట భూమి పైన ఆకాశం చాలా అందంగా ఉంటుంది. దాని ఆస్వాదించండి. బై..
ఇదీ ఆ పైలట్ (Spice Jet Pilot) చెప్పిన మాటలు. దీంతో విమానంలో ప్రయానిస్తున్నవారు నవ్వులలో మునిగిపోయారు. ఈ మొత్తం సంఘటన విమానంలో ప్రయాణిస్తున్న ఎప్సితా అనే యువతి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానిని స్పైస్ జెట్ సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఉంచింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ముందు ఇంగ్లీష్ లో పైలట్ ప్రకటన వచ్చింది. తరువాత హిందీ ప్రకటన ప్రారంభం అయింది. మొదటి వాక్యమే నాకు ఇంట్రస్టింగ్ గా అనిపించింది వెంటనే రికార్డింగ్ మొదలు పెట్టాను అని ఆమె తన ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొంది.
ఈ విమాన ఘటన మీరు కూడా ఇక్కడ ట్వీట్ లో చూడొచ్చు..
In a @flyspicejet flight from Delhi to Srinagar & omg, the captain killed it!
They started off in English, but I only began recording later.
Idk if this is a new marketing track or it was the captain himself, but this was so entertaining & endearing! pic.twitter.com/s7vPE2MOeP
— Eepsita (@Eepsita) December 16, 2022