Site icon Visheshalu

World cup cricket 2023 schedule: పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్.. షెడ్యూల్ ఇదే..

world cup cricket 2023 schedule

world cup cricket 2023 schedule

పదేళ్ళ తరువాత భారత్ లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించ బోతున్నారు. ఈ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్(world cup cricket 2023 schedule) విడుదలైంది. మంగళవారం ముంబైలో మీడియా సమావేశంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జే షా, శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాల్గొన్నారు.

ముఖ్యమైన మూడూ అహ్మదాబాద్ లోనే..

అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో 46 రోజుల పాటు జరిగే క్రికెట్ సంగ్రామం మొదలవుతుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్ స్టేడియంలో(world cup cricket 2023 schedule) జరుగుతుంది. అలాగే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న ఆసియా లోని అతిపెద్ద ప్రత్యర్థులు.. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి.

ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగేది ఈ స్టేడియమ్స్ లోనే..

అహ్మదాబాద్ (నరేంద్ర మోదీ స్టేడియం), బెంగళూరు (ఎం చిన్నస్వామి స్టేడియం), చెన్నై (ఎంఏ చిదంబరం స్టేడియం), ఢిల్లీ (అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం), ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం), గౌహతి (అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం), హైదరాబాద్ (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఉప్పల్), కోల్‌కతా (ఈడెన్ గార్డెన్స్), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం), ఇండోర్ (హోల్కర్ స్టేడియం), ముంబై (వాంఖడే స్టేడియం) మరియు రాజ్‌కోట్ (సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం).

46 రోజుల పాటు టోర్నమెంట్

టోర్నమెంట్ 46 రోజుల పాటు కొనసాగుతుంది. మూడు నాకౌట్‌లతో సహా 48 మ్యాచ్‌లు ఉంటాయి. ఈసారి మొత్తం ప్రపంచకప్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. ఇంతకు ముందు భారత్ తన పొరుగు దేశాలతో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది.

10 జట్లు హోరాహోరీ..

ఈసారి ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య భారత్‌ పాటు.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు 2023 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన రెండు జట్లు క్వాలిఫయర్స్ రౌండ్ నుంచి వస్తాయి.

ఇవి కూడా చదవండి: Adipurush Movie Review: నెక్ట్స్ జెనరేషన్ కథాయణం.. ఆదిపురుష్ రామాయణం! – Visheshalu

RRR in Oscars: ఆస్కార్ బరిలో మన నాటు పాట.. RRR కు అరుదైన అవకాశం – Visheshalu

Exit mobile version