Site icon Visheshalu

World Cup 2023: పాకిస్తాన్ గెలిచింది.. నెదర్లాండ్స్ ఆకట్టుకుంది..

world cup 2023 Pakistan vs Netherlands

world cup 2023 Pakistan vs Netherlands

ముందుగా అనుకున్న ఫలితమే. అద్భుతం ఏమీ జరగలేదు. కానీ, పాకిస్తాన్ మొదటి సారిగా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ భారత్ లో గెలిచింది. వరల్డ్ కప్ 2023 World Cup 2023 లో భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకోగలిగింది పాకిస్తాన్. నెదర్లాండ్స్ జట్టు కూడా తన అనుభవానికి తగిన పోరాటాన్ని ప్రదర్శించింది.

వన్డే ప్రపంచకప్‌ World Cup 2023లో  నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాక్ జట్టు 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. అనంతరం డచ్‌ జట్టు 41 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు తొలిసారి విజయం సాధించింది. అంతకుముందు, 1996 – 2011లో, జట్టు భారతదేశంలో 2 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడింది. రెండింటిలోనూ పాకిస్తాన్ కి ఓటమి తప్పలేదు.

World Cup 2023: ఆ చిన్న టీమే కదా అని అనుకున్న నెదర్లాండ్స్ పాకిస్తాన్ కి ఆరంభంలో చుక్కలు చూపించింది. తక్కువ అంచనా వేసిన బాబర్ జట్టుకి మొదట్లోనే గట్టి షాక్ తగిలింది. 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బెంబేలు ఎత్తింది. ఇటువంటి పరిస్థితిలో వికెట్ కీపర్ మహ్మద్‌ రిజ్వాన్‌, సౌద్‌ షకీల్‌ పాకిస్తాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. నాలుగో వికెట్ కు 120 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఐసీసీ ప్రపంచకప్‌ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు ఇవి నాలుగో అత్యధిక పరుగులు.

World Cup 2023: తరువాత బ్యాటింగ్ ప్రారంభించి.. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్‌కు శుభారంభం లభించింది. దీంతో ఆ జట్టు 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. 5 పరుగుల వద్ద మాక్స్ ఓడౌడ్ అవుటయ్యాడు. తరువాత నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడిపోతూ రావడంతో లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి.. 205 పరుగులకే ఆలౌట్ అయింది.

మరిన్ని వరల్డ్ కప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

Exit mobile version