Site icon Visheshalu

AP Telangana CMs Meet: చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. ముగిసిన ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల బేఠీ!

ap telangana cms meet

AP Telangana CMs Meet: హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పది కీలక అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ఇబ్బందులు లేకుండా పరిష్కారం ఉండేలా చూడాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారుల సూచనలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదించారు. ఈ సమస్యల విషయంలో ఎదురవడానికి అవకాశం ఉన్న న్యాయపరమైన చిక్కులపై కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చింది. షెడ్యూల్ 10లోని అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.నిర్ణీత వ్యవధిలో సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: జింబాబ్వే పై బ్యాటులెత్తేసిన కుర్ర టీమిండియా!మొదటి T20 లో భారత్ ఘోర ఓటమి!!

AP Telangana CMs Meet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలవే..
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనుబంధాలు 9,10లో పేర్కొన్న కంపెనీల ఆస్తుల బదిలీలు
విభజన చట్టంలో పేర్కొనని కంపెనీల ఆస్తుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశాలు
పెండింగ్ విద్యుత్ బిల్లులు
విదేశీ రుణాల సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు కట్టారు. వాటి అప్పుల చెల్లింపులు
జాయింట్ వెంచర్లలో చేసిన ఖర్చులకు చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌లో మూడు భవనాల అవార్డు
లేబర్ బదిలీల చెల్లింపులు
ఉద్యోగుల విభజన సమస్యలు

Exit mobile version