Site icon Visheshalu

Zimbabwe vs India T20: జింబాబ్వే పై బ్యాటులెత్తేసిన కుర్ర టీమిండియా!మొదటి T20 లో భారత్ ఘోర ఓటమి!!

Zimbabwe vs India T20

Zimbabwe vs India T20:  హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత యువ జట్టు 13 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. జింబాబ్వే ఇచ్చిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటానికి బరిలో దిగిన టీమిండియా 20వ ఓవర్ 5వ బంతికి అన్ని వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి ఐపీఎల్ స్టార్ల మితిమీరిన ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. హోం పిచ్‌పై జింబాబ్వే జట్టు బౌలింగ్‌ను పట్టించుకోని భారత బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసి సులువుగా వికెట్లు పారేసుకుని పెవిలియన్‌ చేరారు. చివరికి వాషింగ్టన్ సుందర్ , అవేశ్ ఖాన్ లు విజయం కోసం పోరాడకపోతే శుభ్ మన్ గిల్ జట్టు ఓటమి మరింత ఘోరంగా ఉండేది.

జింబాబ్వే 115 పరుగులు..
Zimbabwe vs India T20:  టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు కూడా రాణించి కెప్టెన్ నిర్ణయాన్ని సరైనదిగా రుజువు చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే తరఫున క్లైవ్ మదాండే అజేయంగా 29 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక డియోన్ మైయర్స్ 23 పరుగులు అందించగా, బ్రియాన్ జాన్ బెన్నెట్ కూడా 15 బంతుల్లో 22 పరుగులు చేశాడు. మరోవైపు టీమిండియా తరఫున రవి బిష్ణోయ్ గరిష్టంగా 4 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు , ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

విఫలమైన టీమిండియా బ్యాటర్లు..
Zimbabwe vs India T20: ఈ లక్ష్యానికి సమాధానంగా టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆరంభం నుంచే పేలవంగా సాగింది. పవర్ ప్లేలోనే టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. జట్టుకు తగిలిన తొలి షాక్ నుంచి ఏ బ్యాట్స్‌మెన్ కూడా కోలుకోలేకపోయాడు. దీంతో 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 102 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు, అవేశ్ ఖాన్ 16 పరుగులు చేసి జట్టును ముజురా ఓటమి నుంచి కాపాడారు. అతను తప్ప జట్టులో ఏ బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా టీ20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వేపై టీమ్ ఇండియా మూడో ఓటమిని చవిచూసింది.

తొలి గేమ్‌లో పేలవ ప్రదర్శన
Zimbabwe vs India T20:  ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ధృవ్ జురెల్, ర్యాన్ పరాగ్ టీమ్ ఇండియాకు టీ20 అరంగేట్రం చేశారు. అయితే వీరిలో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అభిషేక్ శర్మ 4 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయాడు. దీని తర్వాత, ర్యాన్ పరాగ్ కూడా తన అరంగేట్రం మ్యాచ్‌లో ప్రత్యేక ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ర్యాన్ పరాగ్ 3 బంతుల్లో 2 పరుగులకే అవుటయ్యాడు. ధృవ్ జురెల్ కూడా 14 బంతులు ఎదుర్కొని 1 బౌండరీ సాయంతో 6 పరుగులు మాత్రమే చేసి తన వికెట్‌ను లొంగిపోయాడు.

Exit mobile version