ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (wtc final 2023) ఫైనల్ మొదటి రోజు ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. ఓవల్ మైదానంలో, ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్లకు 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 146, స్టీవ్ స్మిత్ 95 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 251 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
హెడ్ కెరీర్‌లో తన 5వ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా, WTC final లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ 38వ అర్ధ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఆట ప్రారంభంలో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
వార్నర్ హాఫ్ సెంచరీ మిస్..
ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌కు దిగి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా వికెట్ కోల్పోయింది. ఖవాజా ఇక్కడ సున్నాతో ఔటయ్యాడు. ఖ్వాజా ఔటైన తర్వాత డేవిడ్ వార్నర్ (43 పరుగులు) మార్నస్ లబుషెన్ (26 పరుగులు)తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేశాడు.
భారత జట్టులో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు.
సెషన్ల వారీగా మ్యాచ్ పరిస్థితి ఇదీ..
మొదటి సెషన్ : భారత పేసర్ల ఆధిపత్యం
తొలి రోజు తొలి సెషన్‌లో భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. కంగారూ జట్టు 73 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. గ్రీన్ ట్రాక్ పై షమీ-సిరాజ్ జోడీ తమ స్వింగ్ ను ప్రదర్శించడంతో నాలుగో ఓవర్ నాలుగో బంతికి జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఇక్కడ సిరాజ్ ఖ్వాజాను పెవిలియన్ పంపాడు. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన తర్వాత, వార్నర్-లాబుషెన్ మధ్య 69 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఈ భాగస్వామ్యం మరింత బలపడే సమయంలో శార్దూల్ ఠాకూర్ బ్రేక్ చేశాడు. వార్నర్ ను 43 పరుగుల వద్ద అవుట్ చేశాడు.
రెండవ సెషన్ : హెడ్-స్మిత్ భాగస్వామ్యంతో కంగారూల పునరాగమనం
రెండో సెషన్‌కు ఆస్ట్రేలియా జట్టు కొలుకుంది. ఈ సెషన్‌లో ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. సెషన్ ప్రారంభంలో లాబుషెన్ వికెట్ కోల్పోయిన తర్వాత, స్టీవ్ స్మిత్ ట్రెవిడ్ హెడ్‌తో కలిసి 164 బంతుల్లో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నారు.
మూడ సెషన్ : భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు,
ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించడంతో రోజు చివరి సెషన్‌లో 157 పరుగులు చేశారు. ఇందులో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మూడో సెషన్‌లో వికెట్‌లేకుండా 157 పరుగులు వచ్చాయి. ఈ సెషన్‌లో ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేశాడు.