Site icon Visheshalu

world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..

world cup 2023 SA vs Srilanka

world cup 2023 SA vs Srilanka

ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ రికార్డులకు వేదికగా మారిపోతోంది. సైలెంట్ గా వచ్చి సునామీ సృష్టించేది ఒకరు.. హడావుడి సృష్టించి అక్కడ బోర్లా పడేది మరొకరు.. ఇది క్రికెట్ లో సర్వసాధారణ విషయం. అయితే, వరల్డ్ కప్ దగ్గరకు వచ్చేసరికి చాలా మారిపోతాయి. కొడతారు అనుకున్నవారు బ్యాట్ ఎత్తేస్తారు.. తీస్తారు అనుకున్నవారు బంతిని తిప్పలేక తికమక పడతారు. అయితే, సాధారణంగా ప్రపంచ కప్ మ్యాచ్ లు చాలా స్లోగా అంటే పెద్ద సంచలనాలు లేకుండా ప్రారంభం అవుతాయి. కానీ.. ఈసారి సీన్ రివర్స్. మొదటి మ్యాచ్ లోనే రికార్డులు తలలకిందులు అయ్యాయి. ఇక నాలుగో మ్యాచ్ కి వచ్చేసరికి వరల్డ్ కప్ రికార్డులు కాదు.. క్రికెట్ వరల్డ్ రికార్డులు మారిపోయాయి. అవును ప్రపంచ కప్ 2023 లో నాలుగో మ్యాచ్ గెలుపు.. ఓటమిల లెక్కలు చెప్పేకంటే.. రికార్డు లెక్కలు చెప్పడానికే ఎక్కువ సమయం పట్టే పరిస్థితి ఉంది. అందుకే ముందు రికార్డులు చూద్దాం.. తరువాత గెలిచిన.. ఓడిన వారి ఆటతీరు గురించిన లెక్కలు చూద్దాం.

ఇప్పటివరకూ.. వన్డే వరల్డ్ కప్ క్రికెట్ లో ఏ జట్టు చేయనంత ఎక్కువ పరుగులు చేసింది దక్షిణాఫ్రికా టీం. గతంలో అంటే 2015 లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై చేసిన 417/6 స్కోర్ ను తలదన్ని 428/5 స్కోర్ చేసింది సౌతాఫ్రికా..
49 బంతుల్లో సెంచరీ.. అప్పుడెప్పుడో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ 50 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో మార్‌క్రమ్‌ 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు.
ఐడాన్‌తో పాటు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (108 పరుగులు), క్వింటన్ డి కాక్ (100 పరుగులు) సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. టోర్నీలో ఒక జట్టు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
శ్రీలంక బౌలర్ పతిరణకి ఇదో మరచిపోలేని పీడకల సృష్టించిన రోజు. 10 ఓవర్ల బౌలింగ్‌లో రికార్డుస్థాయిలో 95 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్‌ తో సరిపెట్టుకున్నాడు పతిరణ. దీంతో శ్రీలంక తరఫున వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు పతిరణ.

ఇవే కాదు ఓకే మ్యాచ్ లో వన్డేలలో అత్యధిక స్కోర్.. రెండు టీం లూ కలిపి సాధించిన మ్యాచ్ గా పెద్ద రికార్డు. సౌతాఫ్రికా 428 పరుగులు చేసింది.. శ్రీలంక 328 పరుగులు చేసింది. మొత్తం కలిపితే ఒక్కరోజు ఆటలో రెండు జట్లూ కలిపి 756 పరుగులు చేసి రికార్డ్ సృష్టించింది ఈ మ్యాచ్

రికార్డులు సరే.. అసలు ఆట ఎలా జరిగిందీ.. సౌతాఫ్రికా విసిరిన రికార్డ్ స్కోర్ ఛాలెంజ్ కి శ్రీలంక రియాక్షన్ ఏమిటి ? ఇప్పుడు చూద్దాం.

ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు బాడితే.. అవతలి టీం పరస్తితి ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా దెబ్బకి శ్రీలంక అబ్బా అనాల్సి వచ్చింది. మొదట బ్యాట్ చేసిన సౌతాఫ్రికా 429 పరుగుల లక్ష్యాన్ని సృష్టించింది. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక స్టార్టింగ్ లోనే ఓపెనర్లను కోల్పోయింది. అయినా.. శ్రీలంక బ్యాట్స్ మెన్ ఎక్కడా తగ్గలేదు. పోరాటం చేశారు. చివరి వరకూ.. ఒక దశలో అయితే.. గెలుపు శ్రీలంకదే అనిపించింది. అయితే, అంత భారీ స్కోర్ చాలా కష్టమైన విషయం. శ్రీలంక పోరాటం అద్భుతం. ఇక దక్షిణాఫ్రికా తన ప్రపంచ కప్ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. ఏదైనా ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంకపై దక్షిణాఫ్రికాకు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు ఈ రికార్డు 89 పరుగులే.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్డే ప్రపంచకప్‌లో ఇదే అతిపెద్ద స్కోరు. 429 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన శ్రీలంక జట్టు 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది.

Exit mobile version