Site icon Visheshalu

Bigg Boss 6 Telugu: రుచులు ఆరు.. రుతువులు ఆరు.. ఇది బిగ్‌బాస్‌ సీజన్‌ ఆరు.. ఓపెనింగ్ అదిరిందిగా.. హౌస్ లో వీళ్ళే 

biggboss 6 telugu Opening Event

మనకి రుచులు ఆరు.. రుతువులు ఆరు.. ఈ బిగ్‌బాస్‌ సీజన్‌ ఆరు. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌..బిగ్‌బాస్‌ 6 అంటూ కింగ్ నాగ్ బిగ్ బాస్ 6 ఓపెన్ చేసేశారు. నాగార్జున స్వయంగా పాటపాడుతూ హౌస్ మొత్తం తిప్పి చూపించాడు. ఇంతకు ముందు షోల కంటే సూపర్ కలర్ ఫుల్ గా బిగ్ బాస్ 6 హౌస్ అదిరిపోయింది. చాలా రిచ్ గా హౌస్ ఉంది.

నాగార్జున వస్తూనే ‘గెలుపు ఆటమీద ఆసక్తి ఉన్నవాడిని కాదు..ఆటలో ఆశయం ఉన్నవాడిని మాత్రమే గెలిపిస్తుంది.ఈ ఆటలో స్నేహల మధ్య కాస్త పలకరింపునకు పులకరించబోయే ప్రేమలు ఉంటాయి. స్నేహలు, ప్రేమలు ఎన్ని ఉన్నా గెలవాల్సిన చోట నిలబడాల్సినప్పుడు యుద్దాలు ఉంటాయి. ఓదార్పు దూరమై ఒంటరితనం దగ్గరైనప్పుడు ఒడికి చేరిన కన్నీళ్లు ఉంటాయి. ఎన్ని ఉన్నా ఈ యుద్దంలో ఆత్మ విశ్వాసమే ఆయుధం అయినప్పడు ప్రశ్నించడానికి, ప్రశంసించాడనికి, సమర్థించడానికి, శాసించడానికి గెలుపుకు తోడుగా, ఓటడికి ధైర్యంగా,అందరికి అండగా, రాజ్యాన్ని గెలిచే రాజు ఒక్కడుంటాడు’అంటూ బిగ్ బాస్ కాన్సెప్ట్ రివీల్ చేశారు. ఈ ఫీల్డ్‌లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నా తరువాతేరా అంటూ నాగార్జున పంచ్ డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి హంగామా చేశారు నాగార్జున.

హౌస్ లోకి వెళ్ళింది వీళ్ళే..

మొదటి కంటెస్టెంట్‌గా కార్తిక దీపం ఫేమ్‌ కీర్తి, నువ్వునాకు నచ్చావ్‌ పింకీ, చిల్‌ బ్రో అంటూ సిరి బాయ్‌ ఫ్రెండ్‌, నాలుగో కంటెస్టెంట్‌గా నేహా చౌదరి, చలాకీ చంటీ వచ్చేశాడు, ఆరో కంటెస్టెంట్‌గా శ్రీ సత్య, డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌ కల్యాణ్‌, హౌస్‌లోకి చిత్తూరు చిరుత గీతూరాయల్‌, తొమ్మిదో కంటెస్టెంట్‌గా అభినయశ్రీ, అమెరికా అమ్మాయి సీరియల్‌తో పాపులర్ అయింది మెరీనా అబ్రహం, 11వ కంటెస్టెంట్‌గా రోహిత్‌ సహ్నీ, 12వ కంటెస్టెంట్‌గా బాలాదిత్య, నటి వాసంతి కృష్ణన్‌ 13 వ హౌస్‌మేట్స్‌గా ఎంట్రీ, 14వ కంటెస్టెంట్‌గా జడ్చర్ల నటుడు షానీ, కొండబాబు అలియాస్‌ ఆర్జే సూర్య బిగ్‌బాస్‌ 16వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు, ఆర్జీవీ బ్యూటీ ఇనయా సుల్తానా, లేడీ కమెడియన్‌ ఫైమా, 18వ హౌస్‌మేట్‌గా కామన్‌ మెన్‌ ఆదిరె, 19వ కంటెస్టెంట్‌గా రాజశేఖర్‌, ఇస్మార్ట్‌ ఫేమ్‌ అంజలి ఎంట్రీ, ఆఖరి కంటెస్టెంట్‌గా స్టార్‌ సింగర్‌, రేవంత్‌

Exit mobile version