Site icon Visheshalu

Queen Eligebeth II Death: కన్ను మూసిన బ్రిటన్ రాజి ఎలిజబెత్ II.. ఆమె అంత్యక్రియలు ఎక్కడ ఎలా జరుగుతాయంటే..

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II కన్నుమూశారు. ఆమె 6 ఫిబ్రవరి 1952న బ్రిటన్ పాలనను చేపట్టారు. సెప్టెంబర్ 8న ఆయన మరణించిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తున్నారు.

క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు 10వ రోజు అంటే సెప్టెంబర్ 19న రాజ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలు 12 రోజుల పాటు కొనసాగుతాయి. సెప్టెంబర్ 11న రాణి మరణానికి సంతాప సూచకంగా భారత ప్రభుత్వం సంతాప దినాన్ని ప్రకటించింది.

స్కాట్లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్ నుంచి ఆమె భౌతికకాయాన్ని లండన్‌కు తీసుకురానున్నారు. ఇక్కడ వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాణి మృత దేహాన్ని తన భర్త ప్రిన్స్ ఫిలిప్ పక్కన ఖననం చేస్తారు.

96 రౌండ్లు కాల్చి రాయల్ గన్ సెల్యూట్ ..

అంత్యక్రియల సంప్రదాయాల ప్రకారం, దివంగత రాణికి శుక్రవారం రాయల్ గన్ సెల్యూట్ అందించారు. రాణి వయస్సు 96 సంవత్సరాలు, కాబట్టి ఆమెకు సంవత్సరానికి ఒకటి చొప్పున 96 రౌండ్లు కాల్చి గన్ సెల్యూట్ ఇచ్చారు.

అంత్యక్రియలకు ముందు, సాధారణ ప్రజలు ఆమెకు నివాళులర్పించేందుకు వీలుగా రాణి మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఉంచుతారు.

18వ శతాబ్దం నుంచి వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో ఏ చక్రవర్తికి అంత్యక్రియలు జరగలేదు. అయితే, రాణి తల్లి అంత్యక్రియలు 2002లో ఇక్కడే జరిగాయి.

స్కాట్లాండ్ నుండి లండన్ వరకు క్వీన్ ఎలిజబెత్ అంతిమ యాత్ర జరుగుతుంది. స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్ నుండి క్వీన్ ఎలిజబెత్ పార్థివదేహం లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి వెస్ట్ మినిస్టర్ హాల్ కు తీసుకువస్తారు. ఈ సందర్భంగా సైనిక కవాతు ఉంటుంది. ఈ యాత్రలో రాజకుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు.

Exit mobile version