Site icon Visheshalu

అసలైన మ.. మ.. మాస్ అంటే ఇదే.. మెగాస్టార్ మెనియా.. వాల్తేర్ వీరయ్య!

Waltair Veerayya Teaser

Waltair Veerayya Teaser

మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్స్ తో ఇరగదీశారు. చాలా కాలం తరువాత చిరంజీవి మార్క్ సినిమా వస్తోందనే ఆనందాన్ని అభిమానులకు కలిగించారు. చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రలలో దర్శకుడు కెఎస్ రవీంద్ర (బాబీ) రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’. అభిమాణులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్‌ను టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసింది సినిమా యూనిట్. 2023లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ సందర్భంగా వెల్లడించారు.

చిరంజీవి సినిమాలో ‘వాల్తేర్ వీరయ్య’లో చిరంజీవి నుంచి ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అన్నీ అభిమానులకు అందుతాయని ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. వాల్తేర్ వీరయ్యను ఒక పెద్ద నౌకలో కూర్చున్న విలన్ ఎగతాళి చేయడంతో టైటిల్ టీజర్ ప్రారంభమవుతుంది. అప్పుడు, మెగాస్టార్ వస్తాడు అదీ మామూలుగా కాదు మండే అగ్ని కణంలా.. చేతిలో బీడీ.. నోటిలో పొగ.. ఒకే ఒక్క షాట్ అంతే.. ఇదిచూసిన ప్రేక్షకులకు పూనకాలు వచ్చేశాయి. అందుకే ఈ టీజర్ నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తోంది.

మళ్లీ పాత చిరంజీవి వచ్చాడని భావించేలా టైటిల్ టీజర్ అభిమానులను థ్రిల్‌కి గురి చేసింది. మెగాస్టార్ సిట్-అప్‌లు, వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్.. క్యారెక్టరైజేషన్ అన్నీ చిరంజీవి పాత బ్లాక్‌బస్టర్‌లలోని దిగ్గజ పాత్రల జ్ఞాపకాలను తిరిగి తెచ్చాయి.

ఈ చిత్రానికి ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రాఫర్ కాగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి నిరంజన్ దేవరామన్ ఎడిటర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందించగా, బాబీ స్వయంగా కథ, సంభాషణలు రాశారు.

Exit mobile version