Site icon Visheshalu

Kaikala Satyanarayana:తెలుగు సినిమా మరో లెజండరీ నటుడ్ని కోల్పోయింది

Kaikala Satyanarayana

Kaikala Satyanarayana

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) ఇక లేరు. తీవ్ర అనారాగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌటారం గ్రామం లో జన్మించిన ఆయన సినిమా నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా విలక్షణమైన జీవితాన్ని గడిపారు. నటుడిగా ఆయన చెయ్యని పాత్రలు లేవు. దాదాపు ఆరు దశాబ్దాలుగా సినిమాల్లో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా నటుల్లో అద్భుత నటనా పటిమను కనబరిచిన వారిలో టాప్ ప్లేస్ లో సత్యనారాయణ పేరు ఉంటుంది.

ఎస్వీఆర్ వారసుడిగా సత్యనారాయణ (Kaikala Satyanarayana) ను చెప్పవచ్చు. ఎందుకంటే.. ఎస్వీరంగారావు తరువాత అన్ని రకాల పాత్రలు పోషించి.. మెప్పించిన నటుడు సత్యనారాయణ ఒక్కరే. ఎన్టీఅర్ కు ధీటుగా ప్రతి నాయకుని పాత్ర చేయాలంటే సత్యనారాయణ పేరే మొదట వినిపించేది. నవరసాలనూ అలవోకగా ఆవిష్కరించగలిగిన నటులు భారత సినిమాలో చాలా తక్కువ మంది. వారిలో సత్యనారాయణ పేరు మొదటి వరుసలో ఉంటుంది. సాంఘిక.. చారిత్రాత్మక.. పౌరాణిక ఇలా అన్ని రకాల జోన్ లలోనూ సత్యనారాయణ తనదైన శైలిలో అలరించారు.

కైకాల సత్యనారాయణ మృతికి తెలుగు సినీ ప్రపంచం నుంచే కాకుండా యావత్ భారత సినిమా ప్రపంచం నుంచి అందరూ నివాళులు అర్పిస్తున్నారు.

Also Read:

RRR in Oscars: ఆస్కార్ బరిలో మన నాటు పాట.. RRR కు అరుదైన అవకాశం

 

Exit mobile version