Site icon Visheshalu

Adipurush: ఆదిపురుష్ గురించి చిరంజీవి అలా అన్నారట.. ప్రభాస్ ఎమోషన్..

Adipurush pre release event Prabhas speech

రామాయణం ఎన్నిసార్లు విన్నా.. చూసినా.. కొత్తగానే కనిపిస్తుంది.. వినిపిస్తుంది. నారాయణుడు నరుడిగా భూమి పై జీవించి.. మనిషి ఎలా ఉండాలనే ధర్మాన్ని ఆచరించి చూపించిన ఇతిహాసమే రామాయణం. రాముని చరిత్రను ఎంతో మంది సినిమాలు తీశారు. టీవీలో సీరియల్ గా ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా ప్రదర్శితం అయింది. అయితే, ఇది జరిగి తరాలు గడిచిపోయాయి. వేగంగా తరాల మధ్య అంతరం పెరిగిపోతోంది. రాముని కథ కూడా ఇప్పటికే అనేక రూపాలలో ప్రజల్లో తిరుగాడుతోంది. అయితే, ఇప్పటి తరానికి రామాయణం పూర్తిగా తెలియదు అంటే అతిశయోక్తి కాబోదు. రాముని గురించి.. ధర్మం కోసం రాముడు చేసిన యుద్ధం గురించి స్పష్టంగా తెలిసిన వారు ఈరోజుల్లో చాలా తక్కువ అనే చెప్పాలి. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్నారు ఓం రౌత్.. బాహుబలిగా ప్రభాస్ ను చూశాకా ఈ పాయింత్ ఆధారంగా తాను తీయాలని అనుకుంటున్న రామాయణానికి ఆయనే రాముడు అని ఫిక్స్ అయిపోయారు. దానికి ప్రభాస్ కూడా రెడీ అయిపోయారు. కట్ చేస్తే పేరుతో రాముని సినిమా రెడీ అయిపోయింది. ఆ తరం వాళ్ళకి తెలిసిన రాముడిని.. ఈ తరం వాళ్ళు కోరుకునే రాముడిని కలగలిపి ఆదిపురుష్(Adipurush) గా రామాయణంలోని ముఖ్య ఘట్టాలు తెరకెక్కాయి. జూన్ 16 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఈ నేపధ్యంలో తిరుపతిలో లక్షలాది మంది అభిమానుల మధ్య ఆదిపురుష్(Adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక గురు చిన జీయర్ స్వామి సమక్షంలో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్ ఆదిపురుష్ గురించి.. సినిమాతో తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించడం తన అదృష్టం అన్నారు. ఆదిపురుష్ తాను చేస్తున్నానని తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కు ఫోన్ చేశారట. రామాయణం సినిమా చేస్తున్నావా? అని ఆయన అడిగారట ప్రభాస్ ని. అవును అని ప్రభాస్ చెప్పిన వెంటనే.. “ఎంతో అదృష్టం ఉంటేనే కానీ రామాయణం లో నటించే ఛాన్స్ రాదు.. ఆ అదృష్టం నీకొచ్చింది” అంటూ చిరంజీవి అభినందనలు చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన ప్రభాస్ తనకు ఆ అదృష్టం దక్కిందని చెబుతూ ఎమోషన్ అయ్యారు. మొత్తమ్మీద ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరిలోనూ అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇవి కూడా చదవండి:

adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ బ్లాగ్ – Visheshalu

ఆదిపురుష్ టీం అపురూప నిర్ణయం.. శ్రీరామబంటుకు ప్రత్యేకం.. సినిమా చరిత్రలో సంచలనం – Visheshalu

Exit mobile version