Site icon Visheshalu

Laatti Review: కథతో సంబంధం లేకుండా యాక్షన్ చాలు అనుకుంటే ‘లాఠీ’ చూసేయవచ్చు!

Laatti Review

Laatti Review

విశాల్ తమిళంలో సినిమాలు(Laatti Review) చేసినా తెలుగు వాడిగా తెలుగులోనూ ఆ సినిమాల డబ్బింగ్ లతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. విశాల్ సినిమా అంటేనే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకూ విశాల్ తమిళంలో చేసిన సినిమాలు అన్నీ తెలుగులోకి వచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విశాల్ నటించిన సినిమా తెలుగులోనూ విడుదల అవుతుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపధ్యంలో తాజాగా లాఠీ(Laatti Review) పేరుతో కొత్త సినిమాతో విశాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మళ్ళీ ఫుల్ యాక్షన్ కంటెంట్ తో వచ్చిన విశాల్ లాఠీ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం రండి.

సినిమా స్టోరీ లైన్ ఇదీ..

ముక్కు సూటిగా వ్యవహరించే ఒక పోలీస్ కానిస్టేబుల్. ఎవరినైనా హింసించడం అంటేనే ఇష్టపడని అమాయక పోలీస్. భార్య, ఒక కొడుకుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇంతలో అతను పనిచేస్తున్న స్టేషన్ కి ఒక నేరస్థుడిని అరెస్ట్ చేసి తీసుకువస్తారు. డీఐజీ ఈ కానిస్టేబుల్ కు ఆ నేరస్థుడిని లాఠీ (Laatti Review) తో కొట్టమని ఆదేశిస్తాడు. తప్పనిసరి అయి ఉద్యోగ ధర్మంగా ఆ నేరస్థుడిని కొడతాడు కానిస్టేబుల్. అయితే, తనను పట్టుకున్న డీఐజీ మీద కాకుండా తనను కొట్టిన కానిస్టేబుల్ మీద రీవెంజ్ పెంచుకుంటాడు నేరస్థుడు. అసలు ఆ నేరస్థుడు ఎవరు? అతనికి కానిస్టేబుల్ కి మధ్య గొడవ ఏమైంది? తన పగ తీర్చుకోవడానికి కానిస్టేబుల్ ను ఎలా ఇబ్బంది పెట్టాడు? దాని నుంచి కానిస్టేబుల్ ఎలా బయటపడ్డాడు? ఇలాంటి సందేహాలన్నీటికీ లాఠీ సినిమానే సమాధానం.

ఎవరు ఎలా చేశారు?

కానిస్టేబుల్ పాత్రలో హీరో విశాల్(Laatti Review) ఒదిగి పోయాడు. యాక్సన్ సన్నివేశాల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అన్నిరకాల సీన్స్ లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక అతని భార్యగా నటించిన సునైనా ఫర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సినిమా ఎలా ఉంది?

ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ (Laatti Review) ఇది. అయితే, ఆ యాక్షన్ సన్నివేశాలు ఒకో చోట సాగదీసినట్టుగా సాగి.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఒక సాధారణ కానిస్టేబుల్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ముఠా.. దానిని ఎదుర్కోవడానికి కానిస్టేబుల్ చేసే ప్రయత్నం ఈ నేపధ్యంలో చాలా యాక్షన్ సన్నివేశాలు వస్తాయి. కొన్ని సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. విశాల్ ఫైట్స్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. కానీ.. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రం చికాకు పరిచేవిగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ పెద్దగా కొత్తదనం లేకుండా సాగింది. సినిమా అంతా పాత పద్ధతి కథ.. కథనాలతో సాగడం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది.

టెక్నికల్ గా..

సినిమా టెక్నికల్ గా ఫర్వాలేదనే విధంగా ఉంటుంది. యవన్ శంకర్ రాజా పాటలు (Laatti Review) బాగానే ఉన్నాయనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సొ సొ గా ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ బాలకృష్ణ తోటల కష్టం కనిపిస్తుంది. పీటర్ హెయిన్స్ స్టంట్స్ బావున్నాయి. దర్శకుడు పాత యాక్సన్ సినిమాలను దాటిపోలేదని అనిపిస్తుంది. కొత్తదనం పూర్తిగా లేదని చెప్పవచ్చు.చివరగా ఓ మాట.. సినిమా ఎలా ఉన్నా ఫర్వాలేదు.. యాక్షన్ సన్నివేశాలుంటే చాలు అనుకునే వారికి లాఠీ మంచి సినిమా అవుతుంది.

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా అందించిన పాట‌లు, నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. బాలసుబ్రమణ్యం, బాలకృష్ణ తోటల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణంలో ఉన్న ఒకే భవనం చుట్టూ సాగే సుదీర్ఘ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం (Laatti Review) మెప్పిస్తుంది. పీటర్ హెయిన్స్‌ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ సినిమాకి కీల‌కం. దర్శకుడు ఎ వినోద్ కుమార్ కొన్ని సన్నివేశాలను సమర్థంగా న‌డిపించినా, అక్క‌డ‌క్క‌డా అత‌ని అనుభ‌వ‌రాహిత్యం క‌నిపిస్తుంది. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు చాల‌లేదు. వాటిలో కొత్త‌ద‌నం కూడా క‌నిపించ‌దు.

తెరపై వీరు : విశాల్, సునైనా, ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్ త‌దిత‌రులు;

తెరవెనుక వీరు: సంగీతం: యువన్ శంకర్ రాజా; ర‌చ‌న‌: పొన్ పార్థిబన్; ఛాయాగ్ర‌హ‌ణం: బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణ తోట; పోరాటాలు: పీట‌ర్ హెయిన్‌; నిర్మాణం: ర‌మ‌ణ, నంద‌; దర్శకత్వం: ఎ వినోద్ కుమార్; బ్యానర్: రానా ప్రొడక్షన్స్; విడుద‌ల‌: 22-12-2022

Exit mobile version