టీవీ కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన హైపర్ ఆది(Hyper Aadi Marriage)రానురాను అదే షోలో క్రూ లీడర్ స్థాయికి ఎదిగాడు. ఆపై తిరుగులేని పంచులతో మంచి హాస్యరచయితగా పేరు తెచ్చుకున్నాడు. తనకు వచ్చిన పాపులారిటీతో ఎన్నో షోలు చేస్తూ బిజీ అయిపోయాడు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేక అభిమానులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. బుల్లితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం ‘సార్’లోనూ ఆది మెప్పించాడు.
ఇటీవల ఆయన పెళ్లి చేసుకుని కుటుంబ పెద్దగా మారాలని అనుకుంటున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదికి కాబోయే భార్య ఎవరు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ యూట్యూబ్ హోస్ట్‌పై ఆదికి క్రష్ ఉంది. ఆది ఆమెకు చాలా కాలంగా తెలుసు. ఓ రకంగా చెప్పాలంటే ఆది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె చాలా హెల్ప్ చేసింది. స్నేహంగా మొదలైన వీరి బంధం ప్రేమగా మారింది.
రీసెంట్ గా తమ ప్రేమ గురించి ఇంట్లో చెబితే ఇద్దరు పెద్దలు కూడా ఒప్పుకున్నారు. త్వరలో ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేసేందుకు శుభ ముహూర్తాన్ని ఫిక్స్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో పెళ్లిని(Hyper Aadi Marriage) అధికారికంగా అమ్మాయి పేరుతో సహా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు.