Site icon Visheshalu

G20 Summit: పేరు మార్పు గోల.. ప్రపంచ స్థాయి ఈవెంట్ ముందు ఏల?

g-20 summit

g-20 summit

మన దేశం(G20 Summit) పేరుపై జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత ఆర్టికల్ లో మన దేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మన దేశాన్ని ఇండియా అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? ఈ పేరు ఎక్కడ నుంచి వచ్చింది అనే అంశాన్ని పరిశీలిద్దాం.

ఇండియా అనే పేరు ఎలా వచ్చింది?

ఇండియా అనే పేరు క్రీస్తు పూర్వం300 ప్రాంతంలో వచ్చింది. సింధు నది కారణంగా ఈ పేరు(G20 Summit) వచ్చింది. సింధును గ్రీకు భాషలో ఇండస్ అంటారు. సింధు అనే పద్యం లాటిన్ భాష నుంచి వచ్చింది. అప్పట్లో అంటే క్రీస్తుపూర్వం 300లో మొదటిసారిగా మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి సింధు నదికి అవతల ఉన్న ప్రాంతానికి ఇండియా అనే పదాన్ని ఉపయోగించాడు. మెగస్తనీస్ ప్రాచీన గ్రీకు చరిత్ర కారుడు. అతను దౌత్యవేత్తగా పేరు పొందాడు. ఇతను మౌర్య సామ్రాజ్యంలో భారతదేశపు రాయబారిగా ఉండేవాడు. అటు తరువాత గ్రీకు చరిత్ర కారుడు హీరోటోస్ క్రీస్తుపూర్వం 440లో ఇండియా అనే పదాన్ని ఉపయోగించాడు. ఇతను టర్కీ, ఇరాన్ లతో ఇండియాను పోల్చాడు. ఇండియా సారవంతమైన నేలతో అధిక జనాభాతో స్వర్గం లాంటిది అని హీరోటోస్ అప్పట్లో పేర్కొన్నాడు.

హిందుస్థాన్ అని కూడా అన్నారు

ఇక ఈ సందర్భంలో హిందుస్థాన్(India Story) అనే పేరు కూడా మన దేశానికి ఉంది అనే అంశాన్ని మనం మర్చిపోకూడదు. హింద్.. హిందుస్థాన్ పదాలు కూడా 2500 సంవత్సరాల క్రితం వాడుకలోకి వచ్చాయి. బయట దేశాల నుంచి వచ్చే వారు స ని హ అని ఉచ్ఛరించే వారు. అందుకే సింధ్ నదిని హింద్ అని పలికేవారు. ఇక సింధ్ నాగరికతతో సంబంధం ఉన్న ప్రజలను హిందువులు అని అనేవారు. వారున్న ఈ ప్రాంతాన్ని హిందుస్తాన్ అని పిలవడం ప్రారంభించారు.

క్రీస్తుశకం 262లో ఇరాన్ దేశపు ససానియన్ చక్రవర్తి షాపూర్ I – నక్ష్-ఎ-రుస్తమ్ శాసనంలో హిందుస్థాన్ పేరు ప్రస్తావన ఉంటుంది. హిందూకుష్ కొండల వెనుక ఉన్న ప్రాంతాన్ని హిందుస్థాన్(G20 Summit) అని కూడా పిలుస్తారని ఆ శాసనంలో ఉంది. ఇక అరబ్బులు ఈ దేశాన్ని అల్ హింద్ అనీ టర్కిష్ ఆక్రమణదారులు అని పిలిచారు. సుల్తానులు – ఢిల్లీ చక్రవర్తులు తమ భారతీయ ఆధిపత్య భూమిని హిందుస్థాన్ అని పేర్కొన్నారు.

హిందుస్తాన్ టు ఇండియా

చరిత్రకారుడు ఇయాన్ జె. బారో, ‘ఫ్రమ్ హిందుస్తాన్ టు ఇండియా: నేమ్స్ ఛేంజ్ ఇన్ ఛేంజ్ ఇన్ నేమ్స్’ అనే వ్యాసంలో హిందుస్తాన్ ఇండియా(G20 Summit ఎలా అయిందో వివరించారు. ప్రపంచంలోని ఇతర దేశాలవారు హిందూస్థాన్ అనే పదాన్ని 18వ శతాబ్దం మధ్యకాలం నుంచి చివరి వరకు ఉపయోగించారు. అ సమయంలో వారు ఎక్కువగా మొఘల్ చక్రవర్తులు పాలించిన ప్రాంతాలకు వెళ్లేవారు. 19వ శతాబ్దంలో హిందూస్థాన్ అనే పదాన్ని పక్కన పెట్టి మనల్ని సుదీర్ఘకాలం బానిసలుగా పాలించిన బ్రిటిషర్లు ఇండియా అనే పదాన్ని విరివిగా ఉపయోగించడం ప్రారంభించారు. వారి ప్రాపకంలోకి జారిపోయిన సంస్థానాధీశుల రాజులు కూడా తమ రాష్ట్రాల్లో భారతదేశం పేరు చెప్పడానికి ఇండియా అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. 1857 AD నాటికి, భారతదేశంలోని పెద్ద ప్రాంతాన్ని బ్రిటిషర్ల ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. 1857 తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిధిలో ఉన్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. అదే సమయంలో, ఇండియా అనే పేరు వినియోగం మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరిగిపోయింది.

ఇదీ మనకు మన దేశం పేరుపై చరిత్ర చెబుతున్న వాస్తవాలు. అసలు మన దేశాన్ని ఎందరో దోచుకున్నారు. దోచుకోవడానికి వచ్చినవారు వాళ్లయిష్టం వచ్చిన పేర్లు పెట్టేసుకున్నారు. ఎక్కువ కాలం మనలని బానిసలుగా చూసిన బ్రిటీషర్ల ప్రభావం కారణంగా మన దేశం(G20 Summit) చివరికి ఇండియా అనే పేరుతో ప్రపంచంలో పాప్యులర్ అయిపోయింది. అదీకాకుండా పైకి ఏమి చెప్పినా బ్రిటీషర్లనే అన్ని కోణాల్లోనూ ఫాలో అయిపోతూ వచ్చిన మన నాయకులు.. పార్టీలు చాలా బ్రిటిష్ భావజాలలను ఎలాగైతే ప్రజాలమీద రుద్దేశారో ఇండియా అనే పేరును కూడా శాశ్వతం చేసేశారు.

అయితే ,మన రాజ్యాంగంలోకి ఇండియా.. భారతదేశం అనే రెండు పేర్లూ ఎలా ఆమోదించారు అనేది ఒకసారి పరిశీలిద్దాం..

1949 సెప్టెంబరు 17న రాజ్యాంగ పరిషత్‌లో చర్చ జరుగుతున్నప్పుడు, ‘నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్’ అనే క్లాజు చర్చకు వచ్చింది. ఆర్టికల్ 1 చదివినట్లుగా – ‘భారతదేశం, అంటే ఇండియా, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది’. దీనిపై రాజ్యాంగ పరిషత్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇండియా, భారత్ అనే రెండు పేర్లతో అంబేద్కర్ కమిటీ ముసాయిదాపై ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు హరివిష్ణు కామత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని తర్వాత ఆయన ఒక సవరణను ప్రతిపాదించారు. అందులో ఇండియాకి(G20 Summit) బదులుగా భారత్ పేరు సూచించారు. వేదాలు, మహాభారతం, కొన్ని పురాణాలు- చైనా యాత్రికుడు హ్యూయెన్-త్సాంగ్ రచనలలో ఇండియా అసలు పేరు భారతదేశం అని సేథ్ గోవింద్ దాస్ చెప్పారు. కాబట్టి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఇండియాను ప్రాథమిక పేరుగా ఉంచకూడదు అని ఆయన గట్టిగా వాదించారు.

అదే సమయంలో యునైటెడ్ ప్రావిన్స్‌లోని హిల్ డిస్ట్రిక్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న హరగోవింద్ పంత్, ఉత్తర భారత ప్రజలు భరతవర్ష అనే పేరును కోరుకుంటున్నారని, మరొకటి ఏదీ కాదనీ స్పష్టం చేశారు. అయితే ఈ అభ్యంతరాలను కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే కమిటీ ఎటువంటి సవరణ ప్రతిపాదనలను ఆమోదించలేదు. మన రాజ్యాంగంలో ఇండియా, భారతదేశం అనే రెండు పేరులను ఆమోదించింది.

ఇది పురాణాల భారతం నుంచి ఆధునిక భారతం వరకూ మన దేశ పేరుపై జరిగిన కథ. ఇక అసలు విషయానికి అంటే ఇప్పుడు రచ్చ జరుగుతున్న విషయానికి వద్దాం. దీనివెనుక ఉన్న కొన్ని పచ్చి నిజాలు చూద్దాం.

ఇండియా ను భారత్ అని మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదన ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఈ ప్రతిపాదన మొదటిసారిగా వచ్చింది ఇప్పుడు పేరు మార్పు కథానాలపై రచ్చ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి కావడం ఇక్కడ చెప్పుకోవాలసిన విషయం. 2012లో కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్ నాయక్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పీఠికలోని ఆర్టికల్‌ 1లో, రాజ్యాంగంలో ఎక్కడ ఇండియా అనే పదాన్ని వాడినా దాన్ని భారత్‌గా మార్చాలని ఆ బిల్లు ద్వారా ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ‘భారత్‌ మాతాకీ జై’ అనే స్వాతంత్య్ర నినాదంతో పాటు ‘ప్రతి కొమ్మపై పక్షులు విహరిస్తున్న చోట భారతదేశం నా దేశం’ అనే పాటను కూడా ఆయన ఆలపించారు. ఇండియా అనే పదం భూస్వామ్య పాలనను సూచిస్తుందని, అయితే భారత్(India Story) అలా కాదని ఆయన అన్నారు. శాంతారామ్ నాయక్ గోవా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇది వాస్తవం.

తరువాత 2014లో యోగి ఆదిత్యనాథ్ లోక్ సభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో రాజ్యాంగంలోని ‘ఇండియా’ అనే పదం స్థానంలో ‘హిందూస్థాన్’ అనే పదాన్ని డిమాండ్ చేశారు. అందులో ‘భారత్’ను దేశ ప్రాథమిక పేరుగా ఉంచాలని ప్రతిపాదించారు.

అన్నిటికన్నా ముఖ్యంగా 2020 జూన్‌లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ఇందులో రాజ్యాంగంలో రాసిన ఇండియాని కేవలం భారత్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. గ్రీకు పదం ఇండికా నుంచి ఇండియా వచ్చిందని పిటిషనర్ వాదించారు. అందుకే ఈ పేరు తొలగించాలని ఆయన కోర్టుకెక్కారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని మార్చి దేశానికి భారత్ అని మాత్రమే పేరు పెట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.

ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇప్పటికే రాజ్యాంగంలో భారత్ ప్రస్తావన ఉందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలో ‘ఇండియా అంటే భారత్’ (India Story)అని రాసి ఉంది. ఈ పిటిషన్‌ను సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపాలని, పిటిషనర్లు తమ డిమాండ్‌లను ప్రభుత్వం ముందు తెలియజేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆ తరువాత కూడా అడపాదడపా ఇండియా పేరును మార్చాలనే డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ రాజకీయ పరమైనవిగా అందరూ భావిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఎప్పుడు ఇండియా పేరును భారత్ గా మార్చాలి అనే డిమాండ్ ఎవరు చేసినా అది రాజకీయం అనే అంటూ రచ్చ చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. నిజానికి ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కానీ, ముందే చెప్పినట్టు మన దేశంలో(India Story) ఏ విషయమైనా.. అది ఆలుమగలు గోడవైనా రాజకీయ రంగు పులిమేసి యాగీ చేసెయ్యడం నిత్యకృత్యం అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ఇప్పుడు పేరు మార్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పార్టీలు చెబుతున్న కారణం మాత్రం కాస్త నవ్వు పుట్టించేదిగా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఏర్పాటు చేసుకున్న కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నందున ప్రభుత్వం కావాలనే ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రయత్నిస్తోంది అని చెబుతున్నారు. అంతకు మించి సహేతుకమైన కారణాన్ని వారు చెప్పలేకపోతుండడం గమనార్హం.

రాజ్యాంగం ఏమంటుంది?

ఇప్పుడు అసలు ప్రభత్వ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా(India Story) అనే పదానికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన ఏదైనా జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. చాలామంది న్యాయ కోవిదులు చెబుతున్నదాని ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1)లో ఇలా ఉంది. ” భారతదేశం అంటే ఇండియా” రాష్ట్రాల యూనియన్ గా ఉంటుంది. అంటే దీని అర్ధం స్పష్టం. మన దేశం పేరు ఇండియా, భారత దేశం రెండూ అని. ఈ రెండిటిలో ఏ పేరు ఉపయోగించినా అది రాజ్యాంగ బద్ధమే అవుతుంది అని న్యాయ కోవిదులు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా హిందుస్తాన్.. ఆర్యావర్త లేదా జంబూ ద్వీపం అని రాస్తే కచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడూ ఉన్న ఒక సంప్రదాయాన్ని అనుసరించలేదు అంతే. అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇప్పటివరకూ వ్యవహరిస్తున్న చోట మొదటి సరిగా ఇండియాకు పర్యాయ పదంగా రాజ్యాంగం చెప్పిన భారత్ అనే పదాన్ని ఉపయోగించి సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. దీనిని ఆ కోణంలోనే చూడాలి.

ఇప్పుడు మీకు ఓ డౌట్ రావచ్చు. ఇది రాజ్యాంగ విరుద్ధం కానపుడు ఇంత హడావుడి దేనికి? ఈ రాద్ధాంతం ఏమిటి? అని. ఇది పూర్తిగా రాజకీయ రచ్చ. అదీకాకుండా ఇప్పటివరకూ ప్రభుత్వం అధికారికంగా ఇండియా(India Story) పేరును భారత్ గా మార్చే ప్రతిపాదన ఉన్నట్లు కూడా చెప్పలేదు. కానీ రచ్చ మొదలైంది. అసలు అధికారికంగా భారత్ అనే పేరును ఒక్కదాన్నే రాజ్యాంగంలో ఉండేలా చేయాలి అంటే.. దాని కోసం చాలా తతంగం నడవాలి.

ఇండియా అనే పేరును భారతదేశంగా మాత్రమే మార్చవలసి వస్తే, దీని కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఆర్టికల్ 368లో ఇచ్చారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఇందుకోసం మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు తీసుకొచ్చి ఆమోదించాలి. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టులోని 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం రాజ్యాంగ సవరణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఎలాంటి మార్పుకు దారితీయరాదని చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అందువల్ల కచ్చితంగా పార్లమెంట్ ఆమోదం పొందితేనే పేరు మార్పు సాధ్యం అవుతుంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తాజాగా మూడు ప్రధాన చట్టాల్లో మార్పులను ప్రతిపాదించింది. ఇందులో ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారత్ జ్యుడీషియల్ కోడ్ అనేది ఒకటి. ఇప్పటికే హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో దీనిపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఒకవేళ ఇండియా అనే పేరును రద్దు చేస్తే, చాలా రాష్ట్రాలు దానిని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు.

చివరగా..

చివరిగా ఒక్క మాట.. G20 దేశాల సమావేశాలు మన దేశంలో జరగబోతున్నాయి. ప్రపంచం మొత్తం మన దేశ రాజధానిలో నిలబడబోతోంది. ప్రపంచ స్థాయిలో భారతదేశ నాయకత్వ ప్రతిభపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటువంటి చారిత్రాత్మక సమయంలో పేరు మార్పు అంటూ రాజకీయాలు చేయడం సమంజసమా? అనేది అందరూ ఆలోచించుకోవాలి.

మనకి తెల్లారిన దగ్గర నుంచి రాజకీయాలు ఎటూ ఉంటూనే ఉంటాయి. ఇంట్లో భార్యా భర్తల  మధ్యలోనే ప్రతి రోజూ ఎన్నో రాజకీయాలు జరుగుతాయి. కొట్లాటలూ జరుగుతాయి. కానీ, ఇంటికి ఎవరైనా అతిథి వచ్చిన సందర్భంలో ఇద్దరూ కలిసి నవ్వుతూ వారిని పలకరించి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తారు. ఇది మన సంస్కృతి. రాజకీయానికీ.. కొట్లాటకీ సమయం సందర్భం ఉంటాయి అనేది వాస్తవమే కదా. ఇప్పుడు మన దేశ జెండా నీడలో పెద్ద ప్రపంచ ఈవెంట్ జరగబోతోంది. ఈ సమయంలో అనవసర రాజకీయాలకు పోకుండా.. అంతా కలిసి అతిథుల ముందు పరువు పోకుండా అధికార పక్షం.. పరువు తీయకుండా ప్రతిపక్షాలు వ్యవహరిస్తే మంచిది. లేదంటే, ఇప్పటికే చిల్లర రాజకీయాలు చూసీ.. చూసీ విసుగు చెందిన సామాన్యులు అందరి రాజకీయ ముసుగులు తీసి ఛీ అంటారు.

తప్పకుండా చదవండి: India story : మరో రాజకీయ రచ్చ.. ఈసారి మన దేశం పేరుపైనే.. దీని వెనుక కథేంటి?

గమనిక:

వివిధ జర్నల్స్.. ఆర్టికల్స్ నుంచి ఈ విషయాలను ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది కేవలం ఒక అవగాహన కోసమే. ఎటువంటి రాజకీయ ప్రేరణ లేదా ఎటువంటి పార్టీల సమర్ధన చేయడం కోసం ఈ ఆర్టికల్ ఇవ్వడం లేదని గమనించగలరు. ఈ ఆర్టికల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి.విశేషాలు నుంచి ఇటువంటి ఆర్టికల్స్ కోసం www.visheshalu.com ఫాలో అవ్వండి. ఆలాగే visheshalutv యూ ట్యూబ్ ఛానల్ సబ్ స్క్రయిబ్ చేయండి.

Exit mobile version