Site icon Visheshalu

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

GST December

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇది ఏడాది క్రితం అంటే డిసెంబర్ 2022 కంటే 10% ఎక్కువ. అప్పుడు జీఎస్టీ ద్వారా రూ.1.49 లక్షల కోట్లు వసూలయ్యాయి. నెల క్రితం నవంబర్‌లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వం రూ.1.67 లక్షల కోట్లు వసూలు చేసింది.

1.5 లక్షల కోట్లకు పైగా వసూళ్లు రావడం ఇది వరుసగా 10వ సారి. అయితే, ఇప్పటి వరకు అత్యధిక జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ 2023లో నమోదయ్యాయి, ఈ సంఖ్య రూ. 1.87 లక్షల కోట్లు దాటింది. ఇది కాకుండా, దేశ జిఎస్‌టి వసూళ్లు వరుసగా 21 నెలలుగా రూ.1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి.

CGST రూ. 30,443 కోట్లు, SGST రూ. 37,935 కోట్లు
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, డిసెంబర్ 2023లో GST వసూళ్లు రూ. 1.65 లక్షల కోట్లు. ఇందులో సీజీఎస్టీ రూ.30,443 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,935 కోట్లు, ఐజీఎస్టీ రూ.84,255 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,534 కోట్లు కలిపి), సెస్ రూ.12,249 కోట్లు. సెస్‌లో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన రూ.1,079 కోట్లు ఉన్నాయి.

Exit mobile version