Nagarjuna Birthday
Nagarjuna Birthday

Nagarjuna Birthday: సంక్రాంతికి చూసుకుందాం ‘నా సామిరంగా’ అంటున్న మన్మధుడు

మన్మధుడు నాగార్జున ఈసారి నా సామిరంగ అంటూ రచ్చ చేయబోతున్నారు. చాలా కాలం తరువాత రఫ్ లుక్ తో కింగ్ నాగ్ వెండితెరపై మెరవబోతున్నారు. ఈరోజు (ఆగస్ట్ 29) నాగార్జున పుట్టినరోజు(Nagarjuna Birthday). ఆయన పుట్టిన రోజు వేడుకలను మన్మధుడు సినిమా రీ రిలీజ్ తో ఘనంగా జరుపుకున్నారు అక్కినేని అభిమానులు. చాలాకాలంగా నాగార్జున నెక్స్ట్ మూవీ ఏమిటి అనే చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది. ఆ చర్చలకు బ్రేక్ వేస్తూ నా సామిరంగా అంటూ ప్రత్యక్షం అయ్యారు. నాగ్ పుట్టినరోజు(Nagarjuna Birthday) సందర్భంగా ఈ సినిమా టీజర్ వదిలారు నిర్మాత.

వందల మంది రౌడీలు వాడ్ని రానీండి ఏసేస్తాం అంటూ ఒక గదిలో ఎదురు చూస్తుంటే.. బల్ల మీద దారువేస్తూ రఫ్ లుక్ లో నాగార్జున అదే గదిలో ప్రత్యక్షం అవడం టీజర్ లో కనిపిస్తోంది. పూర్తి మాస్ లుక్ తో మాస్ డైలాగ్ తో నా సామిరంగ ఈ సంక్రాంతి అదిరిపోవాలి అంటూ నాగార్జున(Nagarjuna Birthday) చెప్పడం సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందనే సంకేతమూ ఇచ్చింది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా, ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ.. ఈ సినిమా దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. ప్రసన్న కుమార్ కథ మాటలు అందిస్తున్నారు. టీజర్ ఆసక్తికరంగా ఉంది. కాగా సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ ఇంకా అలానే ఉంది. ఇతర తారాగణం కూడా ఎవరనేది త్వరలో తెలుస్తుంది. మొత్తంమీద నాగార్జున నా సామిరంగా అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతుండడంతో అభిమానులు ఖుషి అయిపోతున్నారు.

Also Read: Saamajavaragamana OTT: సామజవరగమన రికార్డుల మోత ఇంకా ఆగలేదు.. ఆహా లోనూ అదుర్స్..

Have a look on this: ముంగ‌ట గొయ్యి ఉంది పక్కకు జ‌రుగు

Check Also

India story

India story : మరో రాజకీయ రచ్చ.. ఈసారి మన దేశం పేరుపైనే.. దీని వెనుక కథేంటి?

మన దేశంలో (India story)వివాదాలు కొత్త కాదు. అందులోనూ రాజకీయ వివాదాలు. గతంలో సిద్ధాంతాల రాద్ధాంతాలతో రాజకీయాలు నలుగుతూ ఉండేవి. …

Isro Aditya L1

ISRO Aditya L1: మొదలైన ఇస్రో ఆదిత్యుని సూర్యగ్రహ యాత్ర.. విజయవంతంగా కక్ష్యలో ల్యాండ్..

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత 10వ రోజు శనివారం అంటే సెప్టెంబర్ 2న ఆదిత్య …

Miscarriage

Miscarriage: మన దేశంలో పది శాతం గర్భిణీలకు గర్భస్రావం జరుగుతోంది.. కారణాలేమిటంటే..

ప్రపంచంలోని ప్రతి 100 మంది గర్భిణీలలో 10 మంది గర్భస్రావం(Miscarriage) బాధను అనుభవిస్తారు. భారతదేశంలో కూడా దాదాపు 10 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *