Andhra Pradesh: బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు.. ఒకరి మృతి

Crackers Blast in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో సోమవారం బాణాసంచా తయారు చేసే ఇంట్లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం(Rajamahendravaram)లో చోటుచేసుకుంది.

దీపావళి రోజున జరిగిన ఈ ప్రమాదంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా సమయంలో బాధితుడి భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేరు.

బాణాసంచా పేలుడు తో పాటు ఎల్‌పీజీ సిలిండర్‌ కూడా పేలి ఇల్లు మొత్తం ధ్వంసమైంది. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

పండుగ సందర్భంగా అక్రమంగా పటాకులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో పటాకులు పేలిన సంఘటన  ఇది రెండోసారి.

విజయవాడలోని బాణాసంచా దుకాణంలో ఆదివారం మంటలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.

విజయవాడ గాంధీ నగర్‌లోని జింఖానా మైదానంలో వ్యాపారులు పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

19 షాపుల్లో మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి, భారీ పేలుడు సంభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *