Friday , 29 March 2024

Aadipurush: ప్రభాస్ ఆదిపురుష్ తెలుగు రైట్స్ ఆ సంస్థ సొంతం చేసుకుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హిందూ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు ఓం రౌత్ చారిత్రాత్మక చిత్రాలను తీయడంలో దిట్ట. ఆయన నటించిన లోక్ మాన్య ఏక్ యుగ్ పురుష్ మరియు తానాజీ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో కూడా మనకు తెలుసు.

ఇప్పుడు రామాయణం కథమాన్‌ను తెరకెక్కిస్తున్నాడు. కృతి సనన్ సీతగా కనిపించనుండగా, ప్రభాస్ రామ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడి పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ లేదా ట్రైలర్ ను మేకర్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు హక్కులు “యూవీ క్రియేషన్స్” సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై యూవీ క్రియేషన్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరి ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ బర్త్ డే రోజు ఏమైనా అప్ డేట్ ఇస్తుందో లేక ఎప్పటిలాగే అదే బ్యానర్ కలర్ టోన్ మారుస్తుందో చూడాలి.

Check Also

ap elections

AP Elections: నిబంధనలు అందరూ పాటించాల్సిందే.. ఎన్నికల ప్రధాన అధికారి

AP Elections: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో …

GST December

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు అదిరిపోయాయి.. ఎంతంటే..

డిసెంబర్-2023లో ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే GST నుండి దాదాపు రూ.1.65 లక్షల కోట్లు వసూలు చేసింది. …

world cup 2023 SA vs Srilanka

world cup cricket: వామ్మో ఇదేం దంచుడురా బాబూ.. సౌతాఫ్రికా టీంకి పూనకం..

ఒకటా.. రెండా.. రికార్డుల వర్షం.. వరల్డ్ కప్ క్రికెట్ అంటేనే ఉండే మజా వేరు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *